Begin typing your search above and press return to search.
వైరల్ గా `ఎన్టీఆర్ - చరణ్`ల `దోస్తీ` సాంగ్
By: Tupaki Desk | 1 Aug 2021 3:49 PM GMT2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. డెడ్ లైన్ ప్రకారం.. ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు రాజమౌళి సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ ని పెంచారు.
ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మొదటి పాట దోస్తీ ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా అధికారికంగా విడుదలైంది. ఏకకాలంలో ఐదు భాషల్లో ఆవిష్కరించగా.. ఈ పాట యూట్యూబ్ లో అత్యంత వేగంగా వైరల్ అయ్యింది. అత్యధిక లైక్ లతో దూసుకెళుతున్న గ్రేట్ సాంగ్ గా రికార్డులకెక్కింది. ఈ పాటకు కేవలం మొదటి 10 నిమిషాల్లోనే 50K లైక్ లు దక్కాయి. తర్వాతి 10 నిమిషాలకు 50K లైక్ లు వచ్చాయి. ఆ తర్వాతా 35 నిమిషాల్లో 150K లైక్ లు.. 50 నిమిషాల్లో 200K లైక్ లు దక్కాయి. ఇది అసాధారణ రికార్డ్. మొదటి 10 నిమిషాల్లోనే భారీ సంఖ్యలో లైక్ లను రాబట్టడంతో పాటపై ఉన్న క్రేజ్ స్పష్టంగా అర్థమవుతోంది. స్నేహితుల దినోత్సవాన రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు రామరాజు - భీమ్ #దోస్తులుగా కలిసి రావడం సూచిస్తోంది అని జక్కన్న ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన పాత్రల మధ్య స్నేహం నేపథ్యంలో అద్భుతమైన లిరికల్ వ్యాల్యూతో సంగీత దర్శకుడు MM కీరవాణి అద్భుతమైన బాణీని సమకూర్చారు. తెలుగు వెర్షన్‌ను హేమచంద్ర పాడగా.. అనిరుధ్- అమిత్ త్రివేది- విజయ్ యేసుదాస్- యాజిన్ నిజార్ ఇతర నాలుగు భాషలకు పాడారు. ఈ పాటలన్నీ జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యి గాయకులకు కూడా పేరు తెచ్చాయి.
చెప్పిన టైమ్ కే రిలీజ్..
ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ఆర్.ఆర్.ఆర్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా చెప్పిన షెడ్యూల్ కే రిలీజవుతుందని నమ్ముతున్నారు. అందుకు తగ్గట్టే రాజమౌళి ఒక్కో అడుగు పడుతున్నట్టు అర్థమవుతోంది. జూలై 15 న `రోర్ ఆఫ్ RRR`తో అసలు ప్రమోషన్ మొదలైంది. మేకింగ్ వీడియోతో ఒక్కసారిగా RRR కి హైప్ పెంచారు. రోర్ ఆఫ్ RRR కోసమే ప్రత్యేకించి పాపులర్ రాపర్ బ్లేజ్ హైదరాబాద్ లో దిగారు. ఎంఎం కీరవాణితో కలిసి అతడు గాత్రం అందించారు. రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత తాజాగా రిలీజైన లిరికల్ వీడియోతో హైప్ మరింతగా పెరిగింది. మునుముందు మరిన్ని పాటలు.. లుక్ లతో జక్కన్న టీమ్ హైప్ పెంచనున్నారు.
మొత్తం పాటలు ఎన్ని..?
తారక్ తో పాటు...రామ్ చరణ్ పై విదేశీ లోకేషన్ లో పాటల చిత్రీకరణ ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే. రష్యా- ఉక్రెయిన్- రొమానియా- బ్లాక్ సీ ఏరియాల్లో రామ్ చరణ్- అలియా భట్ పై ఓ పాట చిత్రీకరించారు. అలాగే హైదరాబాద్ లో మరో పాట ఇదే జంటపై ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే. కేవలం రెండు పాటలు మినిహా టాకీ పార్ట్ కూడా పూర్తయింది. ఈ పాటల చిత్రీకరణ పూర్తవుతోంది. మరి ఆర్.ఆర్.ఆర్ లో మొత్తం ఎన్ని పాటలున్నాయన్నది యూనిట్ క్లారిటీ ఇస్తే గాని తెలియదు. మునుముందు ఒక్కో అప్ డేట్ రివీల్ కానుంది.
శ్రీయ పాత్ర ఏమిటో కానీ..!
ఇంతకుముందు రోర్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ విజువల్స్ లో శ్రీయ ఛమక్కులా మెరిసింది. ఈ మూవీలో తన పాత్ర ఎలా ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీలో ఈ బ్యూటీ కి ఆఫర్ దక్కినుందుకు ఉబ్బితబ్బిబ్బయిన సంగతి తెలిసిందే. ఇక శ్రీయ ఈ చిత్రంలో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తుందన్న గుసగుస వినిపిస్తోంది.