Begin typing your search above and press return to search.
డబుల్ బిలియన్.. టాలీవుడ్ నుండి ఒకే ఒక్కడు
By: Tupaki Desk | 20 Jan 2022 5:18 AM GMTఅల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా అంతటి ఘన విజయం సాధించడం లో పాటల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని భాషల్లో కూడా పుష్ప పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా ఊ అంటావా ఊఊ అంటావా మరియు సామి సామి పాటలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ ను దక్కించుకున్నాయి. దాంతో పుష్ప ఆల్బమ్ అరుదైన రికార్డును దక్కించుకుంది. పుష్ప పాటలు మొత్తం కలిసి యూట్యూబ్ లో ఆధిత్య మ్యూజిక్ యూట్యూబ్ అధికారిక ఖాతాలో బిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. పుష్ప పాటలు ప్రతి ఒక్కటి కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ ను దక్కించుకున్న నేపథ్యంలో ఈ ఆల్బంకు అరుదైన రికార్డు దక్కింది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన పుష్ప పాటలు అన్ని కూడా కూడా గత కొన్ని నెలలుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఆయన పాటలకు తగ్గట్లుగా సింగర్స్ ను ఎంపిక చేయడం మొదలుకుని అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ట్యూన్స్ ను అందించాడు. దాంతో ఈ పాటలు ఏకంగా బిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా పాటలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ట్యూన్ చేశాడు. దర్శకుడు సుకుమార్ ఈ పాటల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ దేవి శ్రీ ప్రసాద్ తో చేయించాడు అనడంలో సందేహం లేదు. సుకుమార్ మరియు దేవి శ్రీ ప్రసాద్ ల కాంబోలో గతంలో వచ్చిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమా అంతకు మించి అనేందుకు ఈ బిలియన్ వ్యూస్ సాక్ష్యం అనడంలో సందేహం లేదు. పుష్ప కు బిలియన్ వ్యూస్ దక్కడంతో అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డు నమోదు అయ్యింది.
బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో సినిమా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. థమన్ సంగీతం అందించిన అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు అన్ని కలిసి యూట్యూబ్ లో బిలియన్ కు పైగా వసూళ్లను దక్కించుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బన్నీ బిలియన్ మార్క్ ను దక్కించుకోవడం చాలా గొప్ప విషయం. సౌత్ స్టార్ హీరోల్లోనే కాకుండా ఏ ఇతర భాషల్లో కూడా ఈ తరహా బిలియన్ రికార్డును దక్కించుకున్న వారు లేరు. టాలీవుడ్ నుండి రెండు బిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్ అంటూ ఈ విషయాన్ని చాలా గొప్పగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఆధిత్య మ్యూజిక్ వారు షేర్ చేసిన పోస్టర్ ను ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్ తెగ సర్క్యూలేట్ చేస్తున్నారు. బన్నీ మ్యూజిక్ అభిరుచికి ఇది ఒక ప్రత్యక్ష్య సాక్ష్యం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.