Begin typing your search above and press return to search.
బిగ్‌బాస్ లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
By: Tupaki Desk | 29 Aug 2018 5:50 PM GMTతెలుగు బిగ్‌బాస్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్‌కు అయిదుగురు నామినేట్ అవ్వడం జరిగింది. కేవలం మూడు వారాలే మిగిలి ఉండటం, ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉన్న కారణంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఖాయం అని తేలిపోయింది. గత వారంలోనే డబుల్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం జరిగింది. కాని బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ వారంకు వాయిదా వేయడం జరిగింది. ఈవారం ఎలిమినేషన్స్‌కు నామినేషన్స్‌లో కౌశల్ - నూతన్ నాయుడు - సామ్రాట్ - గణేష్ - అమిత్‌లు ఉన్నారు.
ఈ అయిదుగురిలో కౌశల్‌కు ఎలాంటి సమస్య లేదు. మొత్తం ఓట్లలో దాదాపుగా సగానికి పైగా కౌశల్‌కు పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక అత్యల్పంగా గణేష్‌కు ఓట్లు పడుతున్నట్లుగా తెలుస్తోంది. గణేష్ ఎలిమినేట్ అవ్వడం దాదాపు ఖాయం అంటూ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం గణేష్‌తో పాటు అమిత్ బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్నాళ్లు చాలా సేఫ్ గేమ్ ఆడియన అమిత్‌కు చాలా తక్కువ ఓట్లు పడుతున్నట్లుగా ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.
సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన గణేష్ ఎలిమినేషన్ చాలా వారాలుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ వారంలో అతడి ఎలిమినేషన్ ఖాయంగా తేలిపోయింది. గణేష్ స్వయంగా తాను ఇన్నాళ్లు ఉన్నాను అంటూ ఆశ్చర్యంగా ఉన్నాడు. అందుకే ప్రేక్షకులు అతడిని ఎలిమినేట్ చేసేయాలని నిర్ణయించుకున్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఎలిమినేషన్స్‌కు చాలా తక్కువగా వచ్చిన అమిత్ ఈసారి సేవ్ అవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. కౌశల్ తర్వాత స్థానం కోసం సామ్రాట్ మరియు నూతన్ నాయుడులు పోటీ పడుతున్నారు. వీరిద్దరు కూడా సేఫ్ అవ్వడం ఖాయమే అంటూ మా వర్గాల నుండి సమాచారం అందుతుంది.