Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ కు డబుల్ ప్రెజర్?
By: Tupaki Desk | 4 May 2022 1:30 AM GMTస్టార్ డైరెక్టర్ ఇప్పడు డబుల్ ప్రెజర్ తో వున్నారా? అంటే ఇండస్ట్రీ వర్గాలు నిజమే అంటున్నాయి. గతంలో తను చేసే సినిమా విషయంలో చాలా కూల్ గా వుండే స్టార్ డైరెక్టర్ తాజా ఫ్లాప్ తో చాలా డిజప్పాయింట్ కు లోనయ్యారని, తదుపరి ప్రాజెక్ట్ పరంగా డబుల్ ప్రెజర్ ని ఫీలవుతున్నారని ఇన్ సైడ్ టాక్.
వివరాల్లోకి వెళితే. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన భారీ చిత్రం `ఆచార్య` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజే అనూహ్యంగా డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తరువాత బాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలని తలకిందులు చేస్తూ `ఆచార్య` షాకిచ్చింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి చిరుతో కలిసి నటించినా సినిమాని కాపాడలేకపోయారు. ఇదిలా వుంటే ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని భారీ మొత్తాలకు సొంతం చేసుకున్న వారంతా దాదాపు 100 కోట్ల మేర నష్టాలని చవిచూసే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ కు డబుల్ ప్రెజర్ మొదలైందట. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన డైరెక్టర్ తన తదుపరి మూవీ విషయంలో మరింత ప్రెజర్ గా ఫీలవుతున్నారట. `ఆచార్య` తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ డైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మించబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించి చాలా నెలలు అవుతోంది అయితే మే 20న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక అనౌన్స్ మెంట్ ని చేయబోతున్నారట. ఇందుకు సంబంధించిన ప్లాన్ కూడా రెడీ అయిందని ఇటీవల `ఆచార్య` ప్రమోషన్స్ లో దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. అయితే `ఆచార్య` ఫలితం ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడే అవకాశం వుంది కాబట్టి ఈ విషయంలో దర్శకుడు ప్రెజర్ ఫీలవుతున్నారట.
`ట్రిపుల్ ఆర్` తరువాత చరణ్ చేసిన సినిమా `ఆచార్య`. ఇది ఆశించిన ఫలితాన్నివ్వలేకపోయింది. అయితే అదే ట్రిపుల్ ఆర్ లో నటించిన మరో హీరో ఎన్టీఆర్ తో ఇదే దర్శకుడు సినిమా చేయబోతున్నాడు. ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరపైకి రానున్న ఈ మూవీ విషయంలోనూ దర్శకుడు కొరటాల శివ సెంటిమెంట్ ఫీలవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడిగా తన కెరీర్ లో అపజయమే ఎరుగని వ్యక్తిగా రికార్డ్ వున్న ఆయన తాజాగా ఫ్లాప్ ని చూడటంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెజర్ ఫీలవుతున్నారట. మరింతగా స్క్రిప్ట్ ని చెక్ చేసుకుంటున్నారట. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 వ సినిమా ఈ నెలలోనే ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.