Begin typing your search above and press return to search.

పాక్ భామల పోకిరీ చేష్టలు

By:  Tupaki Desk   |   30 Sep 2017 6:55 AM GMT
పాక్ భామల పోకిరీ చేష్టలు
X
పాకిస్తానీ భామలు అప్పుడప్పుడు హిందీ సినిమాల్లో మెరుస్తుండడం చూస్తూనే ఉంటాం. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కుతుండడంతో.. ఇక్కడ కూడా మంచి గుర్తింపునే సంపాదిస్తుంటారు. రీసెంట్ గా రయీస్ మూవీలో పాక్ అందాల భామ మహిరా ఖాన్ మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం.. అదే సమయంలో పాక్ నటీనటులను తీసుకోవడంపై విమర్శలు చెలరేగడంతో తర్వాత అవకాశాలు అందలేదు.

కానీ సినిమా పబ్లిసిటీ కోసమో.. ఇతర సందర్భాల్లోనే మాట్లాడేటపుడు.. పాకిస్తానీ అందగత్తెలు తమ కల్చర్ అంటూ తెగ బిల్డప్ లు ఇచ్చేస్తుంటారు. సంస్కృతీ సాంప్రదాయాల మధ్య తాము ఉంటామని.. పెరుగుతామని.. ఎక్స్ పోజింగ్ లాంటి వాటికి వ్యతిరేకం అని ఉపదేశాలు ఇస్తుంటారు. ఇలాగే బోలెడు కబుర్లు చెప్పిన మహిరా ఖాన్.. రీసెంట్ గా రణబీర్ కపూర్ తో కలిసి బ్యాక్ లెస్ వైట్ గౌన్ లో సిగరెట్ తాగుతూ ఫోటోలకు దొరికింది. తమ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి కల్చర్ ఏమైపోతుందో అర్ధం కాని విషయం.

ఇక సనమ్ తేరీ కసమ్ లో మెరిసిన మరో భామ సబా కమర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది. ఇండియన్ మూవీస్ లో గ్లామర్ అంటే కల్చర్ కబుర్లనే వల్లె వేసింది. అయితే.. సోషల్ మీడియాలో హాట్ పిక్చర్స్ తో ఇప్పటికీ రచ్చ చేస్తూనే ఉంటుంది కమర్. మరి చేసే పనులు అలాంటివి అయినపుడు.. ఇలాంటి కబుర్లు ఎందుకు చెబుతారో అర్ధం కాని విషయం.