Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్‌: డ‌బుల్ XL భామ‌ల పాట్లు చూడ‌త‌ర‌మా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 4:31 AM GMT
ట్రైల‌ర్ టాక్‌: డ‌బుల్ XL భామ‌ల పాట్లు చూడ‌త‌ర‌మా?
X
హుమా ఖురేషి- సోనాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన 'డబుల్ ఎక్స్‌ఎల్' పోస్ట‌ర్లు టీజర్ ద‌శ నుంచి ఆస‌క్తిని పెంచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మేకర్స్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. డ‌బుల్ ఎక్స్.ఎల్ లేడీస్ మూస పద్ధతులను నిస్సంకోచంగా బ్రేక్ చేస్తూ సాగించే ప్ర‌యాణం చాలా సరదాగా కనిపిస్తోంది.

క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి డ్యాన్స్ చేయాల‌ని క‌ల‌లు గంటూ హ్యూమా ఫాంటసీలోకి వెళుతుంది. తాను నిజానికి స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకుంటోంది. కానీ వాస్తవానికి ఆమె శరీరం ఫ్యాటీగా షేమ్ గా ఉండ‌డంతో చాలా చిన్న‌బోతుంటుంది. మీరట్ లోని ఆమె కుటుంబం పెళ్లి కోసం ఎవ‌రో త‌న‌కు న‌చ్చ‌ని అబ్బాయిలందరినీ చూపిస్తుంటుంది. ఇక ఈ భామ ఫోటోలు చూసి చాలా మంది త‌న‌ను తిరస్కరిస్తారు. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వ‌వు.

మరోవైపు సోనాక్షి ఫ్యాషన్ డిజైనర్ కావాలని.. తన పేరుతో సొంత‌ బ్రాండ్ ను ప్రారంభించాలని కోరుకుంటుంది. అయితే ఆమె రూపం అందుకు అడ్డంకి. డ‌బుల్ ఎక్స్.ఎల్ భామ‌లు ఇద్దరూ ఒకరినొకరు దుర్బలమైన ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటారు.

చివ‌రికి ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు క‌లుస్తారు. వారు ఒకరికొకరు మద్దతు గా నిలుస్తూ ప్రేరణగా మారతారు. మహత్ రాఘవేంద్ర -జహీర్ ఇక్బాల్ పాత్రలు కూడా ఈ ప్రయాణంలో వారికి సహాయపడతాయి.

అధిక‌ బరువు గురించి సిగ్గుపడటం వ‌దిలేసి నెమ్మ‌దిగా వారు తమదైన‌ పంథాలోకి మార‌తారు. 'బాస్ లేడీస్' లాగా త‌మ‌ కలలను జయించటానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ట్రైలర్ ఫన్నీ వన్-లైనర్ లతో ఎంతో ఆక‌ట్టుకుంది. నిజ‌ జీవితంలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్న చాలా మందికి రిలేట్ గా ఉంది. హుమా - సోనాక్షిలు ఎంతో అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రానికి ప్రీబిజినెస్ ప‌రంగా చాలా ఆఫర్లు ఉన్నాయని కూడా టాక్ ఉంది.

సోదరుడు సాకిబ్ సలీమ్ ..చిత్రనిర్మాత ముదస్సర్ అజీజ్ లు తమ సంస్థ 'ఎలిమెన్ 3'ని ప్రారంభించ‌గా హూమా ఖురేషీ ఈ చిత్రంతో నిర్మాతగా మారారు. అశ్విన్ వార్దే- విపుల్ షా- రాజేష్ బహల్- భూషణ్ కుమార్ కూడా ఈ చిత్రానికి సహ నిర్మాత‌లుగా ఉన్నారు. జాన్వీ కపూర్ 'మిలి' ఫేం సత్రమ్ రమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డ‌బుల్ ఎక్స్‌ఎల్ నవంబర్ 4న విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.