Begin typing your search above and press return to search.

1 మిలియ‌న్ స‌రే.. 3 మిలియ‌న్ డాల‌ర్లు సాధ్య‌మేనా?

By:  Tupaki Desk   |   19 Dec 2021 4:26 AM GMT
1 మిలియ‌న్ స‌రే.. 3 మిలియ‌న్ డాల‌ర్లు సాధ్య‌మేనా?
X
క‌రోనా క్రైసిస్ ప్ర‌భావంతో సినీప‌రిశ్ర‌మలు అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో పోలిస్తే టాలీవుడ్ బెట‌ర్ రిజ‌ల్ట్ అందుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముఖ్యంగా అమెరికా లాంటి చోట్ల ఒమిక్రాన్ వెంటాడుతున్నా కానీ తెలుగు సినిమాలు వ‌సూళ్ల దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. సెకండ్ వేవ్ అనంత‌రం విడుద‌లైన నాగ‌చైత‌న్య‌- ల‌వ్ స్టోరి.. బాల‌కృష్ణ‌- అఖండ చిత్రాలు ఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద ఒక మిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్లు సాధించి హాట్ టాపిక్ అయ్యాయి. ఆ రెండిటి త‌ర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ - పుష్ప ఈ ఫీట్ ని సాధించింది. ప్రీమియ‌ర్లు క‌లుపుకుని రెండో రోజుకే పుష్ప వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్ లో చేర‌డం ఆస‌క్తిక‌రం.

పుష్ప- ది రైజ్ కి విడుదలకు ముందే ఇంటా బ‌య‌టా చ‌క్క‌ని క్రేజ్ ఏర్పడింది. ప్రీమియర్ షోలకు డిమాండ్ ఏర్ప‌డింది. కానీ థియేటర్లు లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ డిమాండ్ ను రీచ్ కాలేపోయార‌ని స‌మాచారం. అమెరికాలో ప్రీమియర్ షోల నుంచి 543383 డాల‌ర్లు వ‌సూలు కాగా.. శుక్రవారం 429482 డాల‌ర్లు వ‌సూల‌య్యాయి. శనివారం ప్రారంభ అమ్మకాలతో క‌లుపుకుని 1030840 (1 మిలియన్ డాల‌ర్) క్ల‌బ్ లో చేరింది ఈ చిత్రం. సుమారు 6.5 కోట్లు పుష్ప వ‌సూలు చేసింది. శ‌నివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచ‌నా.

సుకుమార్ సినిమాల‌కు అమెరికాలో డిమాండ్ ఉంది. అత‌డు తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం అమెరికాలో 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. అలాగే అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో కూడా ఇదే ఫీట్ ని అందుకుంది. అయితే ఆ రెండు సినిమాల లైఫ్ టైమ్ వ‌సూళ్లు పుష్ప కూడా లైఫ్ టైమ్ లో అందుకుంటుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఈ సినిమా 1 మిలియ‌న్ క్ల‌బ్ నుంచి 3 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ వైపు వెళుతుందా లేదా? అన్న‌ది చూడాలి. ఈ సినిమాకి ఆరంభం డివైడ్ టాక్ రావ‌డం కొంత‌వ‌ర‌కూ మైన‌స్. అయితే అల్లు అర్జున్ వ‌న్ మ్యాన్ షో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది.