Begin typing your search above and press return to search.

చిరు ముందుచూపుతోనే అలా చేశారా?

By:  Tupaki Desk   |   20 Oct 2021 4:27 AM GMT
చిరు ముందుచూపుతోనే అలా చేశారా?
X
ఖైదీనంబ‌ర్ 150- సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి చిత్రాల‌తో మెగాస్టార్ చిరంజీవి ఘ‌న‌మైన పున‌రారంగేట్రాన్ని చాటుకున్నారు. రాజ‌కీయాలు వ‌దిలి తిరిగి వ‌చ్చినా ఆయ‌న‌కు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేద‌ని నిరూప‌ణ అయ్యింది. ఖైదీనంబ‌ర్ 150తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకుని త‌న‌కు అభిమానుల్లో ఫాలోయింగ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. ఆ త‌ర్వాత జాతీయ స్థాయిలో పాన్ ఇండియా స్టార్ గా క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకోవ‌డం మ‌రో కొస‌మెరుపు. ఆ త‌ర్వాత కూడా ఆయ‌న స్పీడ్ ప‌రంగా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. బ్యాక్ టు బ్యాక్ ద‌ర్శ‌కుల్ని ఫైన‌ల్ చేస్తూ బౌండ్ స్క్రిప్టుల్ని రెడీ చేయిస్తూ ఇప్ప‌టికే నాలుగు సినిమాల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ స‌మ‌యంలో క‌థ‌ల్ని వండించే ప‌నిలో చిరు బిజీ అయ్యారు.

ఆయ‌న షెడ్యూల్ చూస్తుంటే మ‌రో నాలుగైదేళ్లు క్ష‌ణం అయినా తీరిక లేకుండా సెట్స్ కి ప‌రుగులు పెట్టాల్సి ఉంటుంది. కానీ చిరు ఏజ్ 60 బార్డ‌ర్ ని క్రాస్ చేసింది. ఈ ఏజ్ ని కూడా ఖాత‌రు చేయకుండా ఆయ‌న సినిమాలు చేస్తున్నారు. రిస్కీ స్టంట్స్ .. డ్యాన్సుల‌తో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. నేటిత‌రం హీరోలు సైతం అసూయ ప‌డేంత ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. ఇక బాస్ లో గ్రేస్ ని చూసి అభిమానుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.

అయితే చిరు లైన‌ప్ చూసి ఒక సెక్ష‌న్ నుంచి సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ఈ ఏజ్ లో అదే దూకుడు కొన‌సాగించ‌గ‌ల‌రా? అంటూ ఒక వ‌ర్గం జ‌నం ప్ర‌చారం చేస్తున్నారు. కానీ చిరు ఎన‌ర్జీ చూస్తుంటే ఇప్ప‌టికే అంగీక‌రించిన నాలుగు సినిమాలే కాకుండా మ‌రో 20-30 సినిమాలు సునాయాసంగా చేసేందుకు వీలుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

కొర‌టాల‌తో ఆచార్య‌ను పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేస్తున్నారు. త‌దుప‌రి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేస్తున్నారు. త‌ర్వాత‌ వేదాళం రీమేక్ భోళా శంకర్ ని పూర్తి చేయబోతున్నారు. త‌ర్వాత కెఎస్ రవీంద్ర తో వాల్టేర్ శీను లైన్ లో ఉంటుంది. మరికొందరు దర్శకులు క‌థ‌లు వినిపించి చిరును లాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో మారుతి పేరు కూడా వినిపిస్తోంది. మ‌రో న‌లుగురు స్క్రిప్టుల్ని వండే ప‌నిలో ఉన్నార‌ని కూడా తెలిసింది. వీరంతా మెగాస్టార్ చిరంజీవి స్వంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో కాకుండా.. బయటి బ్యానర్ లలో చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇక ఇత‌ర అగ్ర బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేస్తే చిరుకి భారీ పారితోషికాలు లాభాల్లో వాటాలు ముడుతుంటాయి.

అయితే చిరు ఇప్పుడున్న సినిమాల షెడ్యూల్స్ ని వేగంగా పూర్తి చేస్తే కానీ త‌దుప‌రి చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యి.. భోళా శంక‌ర్.. వాల్టేర్ శీను విష‌యంలో స‌గభాగం చిత్రీక‌ర‌ణ‌లు పూర్త‌యినా త‌దుప‌రి ఏ సినిమాలు చేయాలి? అన్న‌దానిపై గంద‌గోళం ఉండ‌ద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే నిర్మాత‌ల నుంచి అడ్వాన్సులు అందుకునేందుకు సిద్ధంగా లేర‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లి స‌ర్వేల్లోనూ మెగాస్టార్ కి ఉన్న ఫాలోయింగ్ త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ అయ్యింది. నేటి జ‌న‌రేషన్ తో పోటీపుతూ టాప్ 10 పాపుల‌ర్ స్టార్ల‌లో ఒక‌రిగా చిరు కొన‌సాగుతున్నారు. అందుకే ఎలాంటి భేష‌జానికి పోకుండా మెగాస్టార్ కి ఒక్కో సినిమాకి 50-60 కోట్ల వ‌ర‌కూ గిట్టుబాటు అయ్యేలా నిర్మాత‌లే ప్లాన్ చేస్తున్నారు. అయితే దేనికైనా స‌రైన స‌మ‌యం రావాలి. కొన్నాళ్ల పాటు వేచి చూశాకే చిరుతో క‌మిట‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని విశ్లేషిస్తున్నారు. డైల‌మా లేకుండా క్లారిటీగా ముందుకెళ్లేందుకే చిరు ప్లానింగ్ సాగుతోంద‌ని స‌మాచారం.