Begin typing your search above and press return to search.

ఈ క్యాస్టింగ్ మీద డౌట్ ఏంటంటే..

By:  Tupaki Desk   |   24 Oct 2017 12:30 AM GMT
ఈ క్యాస్టింగ్ మీద డౌట్ ఏంటంటే..
X
తన నటనతో తను ఎంచుకునే పాత్రలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటీమణి.. మహానటి సావిత్రి. అయితే తెర వెనుక కూడా ఆమె జీవితంలో తెలియని ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తను తీసే బయోపిక్ ద్వారా అలాంటి ఘటనలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్.

వైజయంతి బ్యానర్ లో మొదలుపెట్టిన మహానటి సావిత్రి బయోపిక్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. దర్శకుడు లేట్ అయినా పర్వాలేదు గాని సినిమా అవుట్పుట్ చాలా బాగా రావాలని చాలా ఇష్టంగా గౌరవంతో చేస్తున్నాడు. అయితే సినిమాలోని పాత్రల విషయంలో రోజుకో కొత్త న్యూస్ వినబడుతోంది. మహానటి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దుల్కర్ సల్మాన్ - సమంత ప్రకాష్ రాజ్ అలాగే షాలిని పాండే కూడా సినిమాలో నటిస్తున్నారు. ఇక ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారట. ఇక అప్పట్లో మాయాబజార్ సినిమాకు దర్శకత్వం వహించిన కెవి.రెడ్డి గారి పాత్రలో వేదం - కంచె డైరక్టర్ క్రిష్.. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన సింగీతం శ్రీనివాసరావ్ పాత్రలో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నారు. కాని ఈ క్యాస్టింగ్ అంతా కూడా ఎక్కడో సింక్ అవ్వట్లేదు అంటున్నారు జనులు.

విషయం ఏంటంటే.. 1957లో మాయాబజార్ వచ్చే సమయానికి ఎస్వీ రంగారావు వయస్సు 39 ఏళ్ళు. కెవి రెడ్డి వయస్సు 45 ఏళ్ళు. ఆ సమయంలోని కొన్ని మేకింగ్ ఫోటోలు చూస్తే మనకు ఆ ఏజ్ స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కాని ఇప్పుడు మాత్రం 67 ఏళ్ళ మోహన్ బాబును (ఎస్వీర్ పాత్రధారి) 39 ఏళ్ల క్రిష్‌ (కెవి రెడ్డి పాత్రధారి) డైరక్టు చేసినట్లు చూపిస్తే.. ఆ సీన్ తాలూకు ఎసెన్స్ దెబ్బతింటుందేమో అనేది సినిమా లవ్వర్స్ సందేహం. ఇకపోతే సావిత్రి మాత్రం 21 ఏళ్ళకే మాయాబజార్ సినిమాను చేసేస్తే.. ఇప్పుడు ఆ పాత్రను 25 ఏళ్ల కీర్తి సురేష్‌ చేస్తోంది. అది సంగతి.