Begin typing your search above and press return to search.
మోహన్ లాల్ డబ్బింగ్.. డౌట్లు కొడుతున్నాయ్
By: Tupaki Desk | 4 July 2016 7:56 AM GMTదశాబ్దానికి పైగా తెలుగు పరిశ్రమలో ఉంటూ.. పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్న చాలామంది మన భాష నేర్చుకోవట్లేదు. డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అలాంటిది నేరుగా తన తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. కష్టపడి కొన్ని రోజుల్లోనే తెలుగు నేర్చుకుని.. ‘మనమంతా’ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పుకున్నారాయన. ఇటీవలే విడుదలైన టీజర్లో ఆయన సొంత వాయిసే వినిపించింది కూడా. కాకపోతే మాటల్లో స్పష్టత లేకపోయింది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయారాయన. పట్టి పట్టి మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.
ఈ ఫీడ్ బ్యాక్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వరకూ వెళ్లిందట. దీంతో మోహన్ లాల్ డబ్బింగ్ విషయంలో అతను పునరాలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పేసినప్పటికీ.. దాన్ని పక్కనబెట్టేసి ఆయనతో మరింత కసరత్తు చేయించి.. మరోసారి డబ్బింగ్ చెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈసారి డబ్బింగ్ బాగుందనిపిస్తే అలాగే ఉంచేస్తారు. లేదంటే.. డబ్బింగ్ ఆర్టిస్టును ఆశ్రయిస్తారట. మరోవైపు ‘జనతా గ్యారేజ్’కు కూడా మోహన్ లాల్ తో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్న కొరటాల శివ కూడా.. ‘మనమంతా’ టీం ఫీడ్ బ్యాక్ ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి డబ్బింగ్ విషయంలో యేలేటి పెడుతున్న టెస్టులో మోహన్ లాల్ పాసవుతాడా?