Begin typing your search above and press return to search.

'వరుడు కావలెను' బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకునేనా..?

By:  Tupaki Desk   |   2 Nov 2021 9:59 AM GMT
వరుడు కావలెను బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకునేనా..?
X
యువ హీరో నాగ శౌర్య - 'పెళ్లి చూపులు' ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన ''వరుడు కావలెను'' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కథలో కొత్తదనం లేకపోయినా కామెడీ - స్క్రీన్ ప్లే బాగున్నాయనే కామెంట్స్ చేశారు. అయితే టాక్ బాగున్నా.. అది వసూళ్ల రూపంలో కనిపించలేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

'వరుడు కావలెను' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. బ్యానర్ కు తగ్గట్టుగా ఈ సినిమాను రిచ్ గా తీశారు. నాగశౌర్య మార్కెట్ స్థాయిని మించి బడ్జెట్ ని పెట్టినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. రూ.8.60 కోట్ల బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.

నాలుగు రోజుల్లో నాగశౌర్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.30 కోట్ల షేర్ తో 4.75 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ ని బట్టి చూస్తే వీకెండ్ లోనే 5 కోట్ల వరకు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వీకెండ్ లోనే వసూళ్ళు ఊహించిన స్థాయిలో లేకపోతే.. నార్మల్ లో డేస్ లో అంతకు మించి ఎక్సపెక్ట్ చేయలేము. ఈ శుక్రవారం మరికొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో 'వరుడు కావలెను' గట్టెక్కాలంటే కాస్త కష్టమే అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

పెళ్లి నేపథ్యంలో కొంచం అటుఇటుగా ఇలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా 50 కోట్ల వసూళ్ళతో బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇక్కడ వరుడు మాత్రం కాస్త నెమ్మదించాడు. ఇకపోతే నాగశౌర్య సినిమాలు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అందుకే ఈసారి 'వరుడు కావలెను' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టాలనే కసితో వచ్చారు. దీనికి తగ్గట్లుగానే హిట్ టాక్ తెచ్చుకున్నా.. సినిమా వసూళ్ళు మాత్రం గొప్పగా లేవు. మరి వరుడు రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.