Begin typing your search above and press return to search.

తేజకు అస‌లు జ‌డ్జిమెంట్ తెలీదా?

By:  Tupaki Desk   |   26 May 2019 2:30 PM GMT
తేజకు అస‌లు జ‌డ్జిమెంట్ తెలీదా?
X
కాజ‌ల్ - బెల్లంకొండ జంట‌గా న‌టించిన `సీత` రిలీజైంది. స‌మీక్ష‌లు ప్ర‌తికూలంగానే వ‌చ్చాయి. మ‌రి వీటిపై తేజ రివ్యూ ఏంటి? స‌మీక్ష‌ల విష‌యంలో నిజాయితీ క‌నిపించ‌డం లేద‌న్న‌ది తేజ ఒపీనియ‌న్. అయితే దాంతో సంబంధం లేకుండానే రివ్యూలు తేజ‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. సినిమాలో మ్యాట‌ర్ లేద‌ని తేల్చేశారంతా. స‌మీక్ష‌ల్లో సీత తేలిపోయింది! అంటూ సెటైర్లు పేలాయి. అంద‌రూ బిలో యావ‌రేజ్ రేటింగులే ఇచ్చారు. ఒక్క కాజ‌ల్ న‌ట‌న గురించి త‌ప్ప ఇంకేదీ ప్ల‌స్ లేద‌ని తేల్చేశారు. గొప్ప క‌థ ఎంచుకుని సిల్లీగా చూపించార‌ని.. హీరో న‌ట‌న అంతే సిల్లీగా ఉంద‌ని తిట్టేశారు. కామెడీ చేయించ‌బోయి ఇంకేదో చేశాడులే అని సెటైర్లు పేల్తున్నాయ్ ఇప్ప‌టికీ. పైగా ఆస్కార్ సినిమా రెయిన్ మ్యాన్ నుంచి హాఫ్ మ్యాన్ క్యారెక్ట‌ర్ ని కాపీ చేశారంటూ ఓ పుకార్ షికారు చేసింది. కార‌ణం ఏదైనా.. ఫాల్ట్ రివ్యూలు రాసేవాళ్ల‌దేనా? లేక తేజ‌దేనా? అన్న ముచ్చ‌టా సాగింది.


అస‌లు సీత విష‌యంలో ఏం జ‌రిగింది? అన్న‌ది తేజ తాజా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. సీత రిలీజ్ అంత‌కంత‌కు వాయిదా ప‌డింది క‌దా.. ఈ గ్యాప్‌లో ఏవైనా క‌రెక్ష‌న్లు చేశారా? అని ప్ర‌వ్నిస్తే.. అసలు రిలీజ్ ముందు వ‌ర‌కూ సినిమా పూర్త‌యితే క‌దా.. క‌రెక్ష‌న్లు చేసుకోవడానికి. రిలీజ్ వ‌ర‌కూ చిత్రీక‌ర‌ణ‌కే స‌రిగ్గా స‌రిపోయిందని అన్నారు. సినిమా చూశాక అయినా కరెక్ష‌న్ అవ‌స‌రం అనిపించిందా? అన్న ప్ర‌శ్న‌కు.. మొన్న టీవీలో `నువ్వు నేను` చూస్తుంటే ఇంకా క‌రెక్ష‌న్ చేయొచ్చు క‌దా అని అనిపించింది. వెంట‌నే ఎడిట‌ర్‌కి ఫోన్ చేసి `క్లైమాక్స్ లో కొంచెం ఎడిట్ చేయొచ్చు క‌దా` అని అన్నాను. నా త‌త్వం అలాంటిది. నేనెప్పుడూ నా సినిమాల‌తో సంతృప్తి చెంద‌ను అంటూ లాజిక్ చెప్పారు. అన్న‌ట్టు త‌న సినిమాలో త‌ప్పిదం ఉందీ అని తెలిసినా.. ఇక క‌రెక్ష‌న్ చేసేంత స‌మ‌యం లేద‌ని తేజ చెప్ప‌క‌నే చెప్పారు మ‌రి. ఇదొక్క‌టే కాదు.. ప్రీ రిలీజ్ వేడుక‌లో కూడా సినిమా జ‌డ్జిమెంట్ రావ‌డం లేద‌న్నారు క‌దా? అని మీడియా ప్ర‌శ్నిస్తే.. మ‌న సినిమా ఎప్పుడూ మ‌న‌కు ముద్దుగానే ఉంటుంది. కానీ అవ‌త‌లివాళ్లు చెప్పాలి! అంటూ నిజాయితీగా అంగీక‌రించారు. ఇంత సీనియ‌ర్ క‌దా.. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలీదా? అని ప్ర‌శ్నిస్తే.. ఆడియ‌న్స్ కి ఏం న‌చ్చుతుందో నేనే కాదు... జేమ్స్ కేమ‌రూన్ కూడా చెప్ప‌లేడు. మీరు చెప్పిన‌ట్టు అయితే సీనియ‌ర్ డైర‌క్ట‌ర్లు ఎవ‌రూ ఫ్లాప్‌లు తీయ‌కూడ‌దు క‌దా? అని తేజ ఎదురు ప్ర‌శ్నించారు.

చాలా విష‌యాల్లో తెలివిగా ఉండే మీరు.. పాజిటివిటీని తెర‌పై పాత్ర‌ల్లో ఎందుకు తీర్చిదిద్ద‌రు? అని ప్రశ్నిస్తే.. ఫిలిం మేక‌ర్స్.. ప్రేక్ష‌కులు.. స‌మీక్ష‌కులు అంద‌రూ ఒక ఫార్మాట్ కు అల‌వాటు ప‌డిపోయారు. ఉన్న‌ప‌ళాన వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేం. నిదానంగా గుడ్డును ప‌గ‌ల‌కొట్టిన‌ట్టు రావాలి అంతే అంటూ రివ‌ర్స్ లో క్రిటిక్స్ పైనే సెటైర్ వేసే ప్ర‌య‌త్నం చేశారు. ముందు చూపుతో సినిమాలు తీసేవాళ్ల‌కు ఎలాంటి చిక్కులు ఎదుర‌వుతాయి? అన్న ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న‌కు స‌ద‌రు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ జ‌వాబు ఆస‌క్తి ని రేకెత్తించింది. ``ముందు మ‌న చుట్టూ ఉన్న‌వాళ్లు ఒప్పుకోవాలి. నెల‌రోజులు విల‌న్ తో ఉంటాన‌ని సీత‌ అగ్రిమెంట్ ఎందుకు? పెళ్లి కోసం అగ్రిమెంట్ చేసిన‌ట్టు చేసుకోవ‌చ్చు క‌దా? అని కొంద‌రు నాతో క‌థ విన్న‌ప్పుడే అన్నారు. కానీ నేనే ఒప్పుకోకుండా పెట్టాను అలా..`` అంటూ తేజ చెప్పుకొచ్చారు. అయితే సీత పాత్ర‌ను అంత నెగెటివ్ గా తీర్చిదిద్దిన తేజ‌ను క్రిటిక్స్ ఓ ర‌కంగా ఆడుకునే ప్ర‌శ్న‌లే అడిగారు సుమీ!!