Begin typing your search above and press return to search.
మెగాస్టార్ మీసం మారింది.. డౌట్లు పెరిగాయ్
By: Tupaki Desk | 2 Jan 2018 10:29 AM GMTఎప్పటినుండో సైరా సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించేందుకు చాలా కష్టపడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక ప్రక్కన ఫిజిక్ ను చక్కదిద్దుకుని ఆ పాత్రకు కావల్సినట్లు తయారవ్వడం ఒకెత్తయితే.. మరో ప్రక్కన ఆయన తన మీసకట్టును గెడ్డంను చాలా కొత్తగా ఆవిష్కరించుకున్నారు. అలా పొడుగ్గా తిప్పిన మీసం.. గుబురు గెడ్డం.. మెగాస్టార్ ను చాలా కొత్తగా ప్రెజంట్ చేశాయనే చెప్పాలి. కాని ఇప్పుడు అసలు షాక్ తగిలింది.
న్యు ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి మెగాస్టార్ ఇంటికి వెళ్ళారు చాలామంది అభిమానులు. వారందరినీ కలసిన ఆయన.. తన కొత్త లుక్కుతో షాకిచ్చారు. అక్కడ కేవలం క్లీన్ షేవ్ లో కనిపించి కొత్త సందేహాలకు తెరలేపారు. పోనివ్ గెడ్డం మాత్రం తీసేశారంటే.. సరే గెడ్డం మాసిన సీన్లను మొన్నటి షెడ్యూల్ లో తీసేశారు కాబట్టి.. ఇప్పుడు కొత్త లుక్ లోకి మారిపోయారు అనుకోవచ్చు. కాని ఆయన మీసం కూడా మామూలు స్థాయికి తెచ్చేశారంటే.. అసలు 'సైరా' షూటింగ్ ఇంకా డిలే కానుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కూడా ఉందండోయ్.
నిజానికి 'సైరా' కొత్త షెడ్యూలను ఫిబ్రవరి నెలాఖర్లో నయనతార వచ్చాక మొదలెడతారట. అంటే ఇంకా రెండు నెలలు సమయం ఉంది. కాబట్టి మెగాస్టార్ మరోసారి మాసిన గెడ్డం అలాగే కోరలు తిరిగిన మీసాన్ని పెంచడానికి చాలా సమయం ఉంది. అంత గ్యాప్ ఉంది కాబట్టే ఆయన తీసేసి ఉంటారని మెగా సన్నిహితులు కూడా అంటున్నారు. ఆయన లుక్ పై అలాగే సినిమా డిలేపై డౌట్లు అక్కర్లేదు అంటున్నారు. అది సంగతి.