Begin typing your search above and press return to search.
పక్కా ప్లాన్ ప్రకారమే 'శేఖర్' సినిమాను ఆపేశారు..!
By: Tupaki Desk | 24 May 2022 3:30 PM GMTడా. రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ''శేఖర్'' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జీవిత తమకు డబ్బులు చెల్లించలేదంటూ ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేశారు.
సోమవారం ఈ వివాదం పై వాదనలు జరుగగా 'శేఖర్' సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'శేఖర్' నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు అడ్వకేట్ రమేష్ సింగ్ 'శేఖర్' మూవీ రిలీజ్ వివాదం పై స్పందించారు. జీవిత రాజశేఖర్ పై పెట్టింది ఒక ఫాల్స్ కేసు అని.. పక్కా ప్లాన్ ప్రకారం చేశారని ఆరోపించారు. త్వరలోనే అన్ని ఆధారాలతో ఈ విషయాన్ని నిరూపిస్తామని లాయర్ అన్నారు.
ఎన్నో వ్యయప్రయాసలు పడి సినిమా చేసి రిలీజ్ చేస్తే.. దాన్ని ఆపాలని ప్లాన్ చేసి ఇలా చేశారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆర్డర్ లేకున్నా ప్లాన్ ప్రకారమే ఆపేశారు. వీలైనంత త్వరగా వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం.
'శేఖర్' సినిమా బాగుందని టాక్ రావడంతో జీవిత రాజశేఖర్ మీద కక్షతో పరంధామ రెడ్డి మరికొందరితో కలిసి ఇలా ప్లాన్ చేసి ప్రదర్శన ఆపేశారు. వీరిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోబోతున్నాం అని మేకర్స్ తరపు లాయర్ రమేష్ సింగ్ చెప్పుకొచ్చారు.
అంతకుముందు బీరం సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. 'శేఖర్' సినిమా టైటిల్ మొదలుకొని ల్యాబ్ అగ్రిమెంట్ వరకు అన్నీ తన పేరు మీదనే ఉన్నాయని.. సెన్సార్ సర్టిఫికేట్ సైతం నిర్మాతగా నా పేరు మీద వచ్చిందని తెలిపారు.
జీవితా రాజశేఖర్ కు వాళ్లకు మధ్య జరిగింది ఏమిటనేది తనకు అనవసరమని.. తనకు జరిగిన అన్యాయంపై ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జీవిత రాజశేఖర్ కు ప్రొడక్షన్ కు సంబంధం లేదని.. ఈ సినిమాపై తాను రూ. 15 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేశానని.. ప్రదర్శన ఆపేసి సినిమాను చంపేశారని నిర్మాత అన్నారు.
సినిమా ప్రదర్శనను కోర్టు చెప్పలేదు.. సినిమా రైట్స్ ఎటాచ్మెంట్ చేయమని మాత్రమే చెప్పింది. అయినా క్యూబ్ - యుఎఫ్ఓలు ప్రదర్శనలు ఆపి అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏం తప్పు చేశానని.. తన సినిమాకు ఇలా ఎందుకు చేశారని బీరం సుధాకర్ రెడ్డి నిలదీశారు.