Begin typing your search above and press return to search.
ఒకే భాషలో విడుదలైనా అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి
By: Tupaki Desk | 19 Feb 2021 10:00 PM ISTమలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 విడుదల అయ్యింది. దృశ్యం సినిమాను తెలుగు.. హిందీ.. తమిళంలో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు మరియు హిందీ ప్రేక్షకులు దృశ్యం 2 పై చాలా ఆసక్తిగా ఉన్నారు. మోహన్ లాల్ మళ్లీ నటించిన ధృశ్యం 2 నేటి నుండి డైరెక్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఈ సినిమాపై అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ సినిమాను సబ్ టైటిల్స్ తో చూసేందుకు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
దృశ్యం సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో దృశ్యం 2 తమ భాషలో వచ్చే వరకు వెయిట్ చేయడం మా వల్ల కాదంటూ చాలా మంది సినీ అభిమానులు మరియు ప్రేమికులు ఏదోలా కష్టపడి సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్ లో చూసేయాలని భావిస్తున్నారు. మలయాళం ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అయితే దృశ్యం 2 పై ఆసక్తి ఉందో అంతకు ఇంకాస్త ఎక్కువే తెలుగు మరియు హిందీ ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. అందుకే సబ్ టైటిల్స్ తో దృశ్యం 2 ను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. స్ట్రీమింగ్ ప్రారంభం అయిన వెంటనే భాషతో సంబంధం లేకుండా అమెజాన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తెలుగు మరియు హిందీల్లో రీమేక్ అయినా మళ్లీ జనాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దృశ్యం 2కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.