Begin typing your search above and press return to search.
దృశ్యం-2 అప్‌డేట్ అదేనా?
By: Tupaki Desk | 12 Nov 2021 3:16 AM GMTమొత్తానికి అగ్ర నిర్మాత సురేష్ బాబు సైలెన్స్ వీడబోతున్నారు. తన నిర్మాణంలో తెరకెక్కి విడుదల విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటున్న రెండు సినిమాల్లో ఒకదాని సంగతి తేల్చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్ సినిమా దృశ్యం-2, రానా మూవీ విరాటపర్వం రిలీజ్‌ల గురించి ఏదో ఒకటి తేల్చాలని అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తీవ్రమైన ఒత్తిడి వస్తుండటంతో ముందుగా దృశ్యం-2 రిలీజ్ గురించి ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి హింట్ కూడా వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం దృశ్యం-2 రిలీజ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఐతే మారిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని ఆశలు పెట్టుకోవడానికేమీ లేదన్నది చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారట.
ఈ మేరకు ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో భారీ చిత్రాలు థియేటర్లలోకి దిగబోతున్న నేపథ్యంలో పెద్దగా సందడి లేని నవంబరు నెలలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అమేజాన్ ప్రైమ్‌లోనే దృశ్యం-2 రిలీజ్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే దీని ఒరిజినల్ కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అదే ఓటీటీలో రిలీజ్ చేయడం అంతగా రుచించని విషయమే. నారప్ప ఒరిజినల్ అసురన్ సైతం థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లోనే రిలీజైంది. అది అందుబాటులో ఉండగానే తెలుగు వెర్షన్ నేరుగా ప్రైమ్‌లోనే రిలీజైంది. ఇప్పుడు దృశ్యం-2 విషయంలో అయితే రెండు వెర్షన్లకూ థియేట్రికల్ రిలీజ్ లేదు. వేర్వేరు భాషల్లో ఒకే ఓటీటీలో ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కావడం విడ్డూరంగా అనిపించే విషయమే.