Begin typing your search above and press return to search.
ఆ మిస్టరీ అక్కడ కూడా హిస్టరీ అవుతుందా?
By: Tupaki Desk | 21 Jun 2022 11:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'దృశ్యం'. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మలయాళంలో సంచలన విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ కు జోడీగా మీనా నటించిన ఈ మూవీని కేవలం 5 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దాదాపు 75 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సంలచలనం సృష్టించింది. ఇదే మూవీని తెలుగులో వెంకటేష్ , తమిళంలో కమల్ హాసన్, కన్నడలో రవిచంద్రన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు.
మలయాళ వెర్షన్ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో రీమేక్ వెర్షన్ లు కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లుగా నిలిచి సంచలనం సృష్టించాయి. హిందీలో అజయ్ దేవగన్ - శ్రియ కలిసి నటించారు.
అక్కడ కూడా దృశ్యం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకెంది. ఇక శ్రీలంకలో సింహళ భాషలో ఈ మూవీని రీమేక్ చేయగా చైనాలో 'షీప్ వితౌట్ ఏ షెపర్డ్' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ రికార్డు స్థాయి విజయాన్ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఫస్ట్ పార్ట్ విడుదలైన ఏడేళ్ల కు ఈ మూవీకి సీక్వెల్ ని చేశారు. 'దృశ్యం 2' పేరుతో మోహన్ లాల్, మీనా అదే టీమ్ అంతా కలిసి చేసిన ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో విడుదలై తొలి పార్ట్ ని మించి రికార్డులు సృష్టించింది. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే మలయాళ మాతృకని మించి మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయింది.
ఇప్పడు బాలీవుడ్ లో 'దృశ్యం 2'ని అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. శ్రియ అతనికి జోడీగా నటిస్తోంది. 'దృశ్యం'ని నిర్మించిన పనోరమా స్టూడియోస్ నే ఈ సీక్వెల్ ని కూడా నిర్మిస్తోంది. వయాకమ్ 18 స్టూడియోస్, గుల్షన్ కుమార్, టి. సిరీస్ సమర్పణలో అభిషేక్ పాథక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. టబు, అక్షయ్ ఖన్నా,ఇషితా దత్తా, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఈ మూవీని వచ్చే ఈడాది డిసెంబర్ 18 న విడుదల చేస్తున్నట్టు హీరో అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయిన 'దృశ్యం 2' రెండు భాషల్లో నూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'దృశ్యం 2' బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి హిస్టరీని క్రియేట్ చేస్తుందా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. సీక్వెల్స్ ప్రతీ భాషలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. బాలీవుడ్ లోనూ 'దృశ్యం 2' సీక్వెట్ హిట్ అయితే హిస్టరీ క్రియేట్ చేసినట్టేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఇదే జరుగుతుందా? అన్నది తెలియాలంటే ఈ ఏడాది డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.