Begin typing your search above and press return to search.
'దృశ్యం 2' సెన్సార్ పూర్తి.. విడుదల వేదికపై క్లారిటీ ఏది..?
By: Tupaki Desk | 20 Sep 2021 8:07 AM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ డ్రామా ''దృశ్యం 2''. ఇది మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హిట్ 'దృశ్యం 2' చిత్రానికి రీమేక్.. 2014లో వచ్చిన 'దృశ్యం' సినిమాకి సీక్వెల్. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాంబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు (సెప్టెంబర్ 20) ఉదయం విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
అయితే మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లు 'దృశ్యం 2' నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్ రాలేదు. అనుకోని పరిస్థితుల కారణంగా ఫస్ట్ లుక్ విడుదల ఆలస్యం అయిందని.. అసౌకర్యానికి మన్నించాలని నిర్మాతలు ప్రకటన ఇచ్చారు. దీంతో ఇప్పటికే 'నారప్ప' సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల నిరాశలో ఉన్న దగ్గుబాటి అభిమానులు.. ''దృశ్యం 2'' అప్డేట్ చెప్పిన సమయానికి రాకపోవడంతో మరోసారి నిరాశ చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి నిర్మాతలు తాజాగా సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ అందించారు.
''దృశ్యం 2'' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పునఃప్రారంభం అంటూ 'దృశ్యం 2' టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇది పక్కన పెడితే ఈ చిత్రాన్ని మాతృక బాటలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేదా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తారా? అనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దసరా కానుకగా ఈ సినిమాకి స్ట్రీమింగ్ పెడతారని వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంతవరకు మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రాలేదు. మరి త్వరలోనే ఈ సినిమా విడుదల వేదికపై స్పష్టత ఇస్తారేమో చూడాలి.
కాగా, 'దృశ్యం 2' చిత్రంలో ఒక థియేటర్ ఓనర్ అయిన కేబుల్ ఆరేటర్ రాంబాబు.. పోలీసులు తిరగదోడిన పాత కేసు వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?.. వాటి నుంచి తన తెలివితేటలతో ఎలా బయటపడ్డాడు? అనేది చూపించబోతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా కనిపించనుంది. ఇందులో ఎస్తర్ అనీల్ - కృతికా - సంపత్ నంది - పూర్ణ - నదియా - నరేష్ ఇతర పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. డి.సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.