Begin typing your search above and press return to search.
దృశ్యం-2 మొదలయ్యేది అప్పుడే.. సీక్వెల్ నటీనటులు ఎవరంటే..?
By: Tupaki Desk | 26 Feb 2021 7:05 AM GMTటాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో 2014లో వచ్చిన ‘దృశ్యం’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి.. అదే ఫీట్ రిపీట్ చేసేందుకు సిద్ధమవుతోంది యూనిట్. ఇటీవలే ఓటీటీలో రిలీజైన మలయాళం సీక్వెల్ ‘దృశ్యం-2’ ను తెలుగులో రీమేక్ చేయడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది.
ఈ సారి తెలుగు వెర్షన్ కు సైతం ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రంలో పలు మార్పులు సూచించాడట వెంకీ. రిలీజ్ కు ముందే ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీన్ లో వీక్షించారు వెంకటేష్. ఆ తర్వాత తన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో సుదీర్ఘంగా చర్చించారు. ఓటీటీ రిలీజ్ కాబట్టి.. తెలుగు వాళ్లు కూడా చాలా మంది చూసే అవకాశం ఉంటుందని, అందువల్ల రీమేక్ చేయాలా వద్దా? అని తర్జనభర్జన పడ్డారు. చివరకు రీమేక్ చేయడానికే మొగ్గుచూపారు.
అయితే.. తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా పలు మార్పులు సూచించారట. దీంతో.. దర్శకుడు జీతు జోసెఫ్.. వెంకీ సూచనల ప్రకారం స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారట. కాగా.. ఈ చిత్రాన్ని మొత్తం 50 రోజుల్లోనే పూర్తిచేయబోతున్నారట. ఇక, ముహూర్తం డేట్ కూడా ఫిక్స్ చేశారు. మార్చి 8న ఈ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం.
కాగా.. తెలుగు మొదటి పార్టులో వెంకీతోపాటు మీనా, నరేష్, నదియా, కృతిక, ఎస్తేర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దీంతో.. సీక్వెల్ లో ఎవరు నటించబోతున్నారు? అనే ఆసక్తి మొదలైంది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. మొదటి ‘దృశ్యం’లో ఉన్నవారితోనే సీక్వెల్ ను కూడా షూట్ చేయాలని భావిస్తున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ సహకారంతో ఆశిర్వాద్ సినిమాస్ నిర్మించనున్న ఈ సీక్వెల్ ను.. ఈ ఏడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.