Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగిన 'డ్రైవర్ జమున' జర్నీ..!
By: Tupaki Desk | 6 July 2022 1:13 PM GMTకోలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో మెపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటుడు రాజేష్ కుమార్తె.. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. పలు డబ్బింగ్ చిత్రాలతో పలకరించిన ఈ భామ.. 'కౌసల్య కృష్ణమూర్తి' అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో మిస్ మ్యాచ్' 'వరల్డ్ ఫేమస్ లవర్' 'టక్ జగదీశ్' 'రిపబ్లిక్' వంటి సినిమాలో మెరిసింది. ఇప్పుడు ''డ్రైవర్ జమున'' అనే చిత్రంతో అలరించడానికి రెడీ అయింది.
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో పి.కిన్ స్లిన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ''డ్రైవర్ జమున''. ఇందులో ఆమె ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేశ్ బాబు ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన జమున అనే ఓ లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో.. ఈ క్రైమ్ థిల్లర్ తెరకెక్కించారని అర్థం అవుతోంది. ట్విస్టులు, కీలక మలుపులతో ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగిన 'డ్రైవర్ జమున' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆడపిల్లలు డ్రైవింగ్ ఫీల్డ్ లో చాలా కష్టపడతారు అని ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా.. అవేవీ లెక్క చేయకుండా జమున క్యాబ్ డ్రైవర్ గా వెళ్ళింది.
అయితే ఓ రాజకీయ నాయకుడి మర్డర్ కోసం ప్లాన్ చేసుకున్న దుండగుల బ్యాచ్ ను ఆమె కారులో డ్రాప్ చేయాల్సి వచ్చింది. 90 నిమిషాలు ఉండే ఈ జర్నీలో ఏం జరిగింది? జమున ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? రౌడీల బారి నుంచి ఎలా తప్పించుకుంది? అనేది తెలియాలంటే 'డ్రైవర్ జమున' సినిమా చూడాల్సిందే.
అవుట్ అండ్ అవుడ్ రోడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఐశ్వర్య చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్స్ బాడీ లాంగ్వేజ్ ను గమనించి, దానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే ప్రయత్నం చేసింది. మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆడుకాలమ్ నరేన్ - కవిత భారతి - స్టాండప్ కమెడియన్ అభిషేక్ కీలక పాత్రల్లో నటించారు.
'డ్రైవర్ జమున' చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చగా.. గోకుల్ బినోయ్ సినిమాటోగ్రఫీ అందించారు. అనిల్ అరసు యాక్షన్ సీక్వెన్స్ లను డిజైన్ చేశారు. 18 రీల్స్ బ్యానర్ పై ఎస్పీ చౌదరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.