Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: భారీగా డ్రగ్స్ పట్టివేత.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..!

By:  Tupaki Desk   |   9 Dec 2020 4:30 PM GMT
డ్రగ్స్ కేసు: భారీగా డ్రగ్స్ పట్టివేత.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీబీ అధికారులు ముంబైలో జరిపిన దాడులలో కోట్లాది రూపాయల నగదును డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన సూత్రధారి రెగెల్ మహాకాల్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు నిర్వహించారు.

ముంబైలోని అంధేరీ వెస్ట్ ఏరియాలో రూ. 2.5 కోట్ల విలువైన 5 కిలోల హషిష్ మరియు ఇతర నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, రెగెల్ మహాకాల్ కోసం చాలాకాలంగా గాలిస్తున్నారు. సుశాంత్ సింగ్ - రియా చక్రవర్తికి మహాకాల్ డ్రగ్స్ సరఫరా చేసేవాడని వార్తలు వస్తున్నా వారితో సంబంధాలు ఉన్నాయనేది ఇప్పుడు చెప్పలేమని ఎన్సీబీ అధికారులు చెప్పారు. ఇంతకముందు మహాకాల్ తో సంబంధం ఉన్న అనుజ్ కేశ్వాని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మహాకాల్ ని అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామమని చెప్పవచ్చు.