Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేస్: అతను దొరికిపోయాడా?

By:  Tupaki Desk   |   29 July 2017 12:30 AM GMT
డ్రగ్స్ కేస్: అతను దొరికిపోయాడా?
X
టాలీవుడ్ కు ఒక్కసారిగా షాకిచ్చిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఒక పెద్ద ఊరట లభించింది. అసలు నోటీసులు అందుకున్న 12 మంది సెలబ్రిటీలను కూడా కేవలం బాధితులు గానే చూడాలి తప్ప నేరస్థులుగా చూడకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్సయిజ్ ఎన్ ఫోర్సమెంట్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది కూడా ప్రూవ్ అయితే బాధితులుగానైనా చూసింది. లేకపోతే లేదు. కాని ఇక్కడే ఒక సెలబ్రిటీ మాత్రం కాస్త కంగారుపడిపోయి అడ్డంగా దొరికిపోయాడని అంటున్నారు. అతన్ని బాధితుడు అంటూ అఫీషియల్ గా చెప్పేందుకు ఛాన్సిచ్చాడట.

అసలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కనుక బ్లడ్ సాంపిల్స్ అడిగితే.. వాటిని ఇవ్వకుండా నిరాకరించవచ్చని అందరికీ తెలియదట. ఆ విషయం తన లాయర్ ద్వారా తెలుసుకున్న ఒక యంగ్ హీరో ముందుగా శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తరువాత ఒక హీరోయిన్ ఏకంగా కోర్టు పర్మిషన్ తెచ్చుకుని మరీ శాంపిల్స్ ఇవ్వకుండా ఆపింది. దానితో చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఒక స్టార్ హీరో కూడా అలాగే చేశాడు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ ను ఫేస్ చేసిన ఒక పెద్ద సెలబ్రిటీ మాత్రం.. శాంపిల్స్ అడిగిన వెంటనే ఇవ్వకపోతే అదేమన్నా పెద్ద నేరమేమో అనుకుని.. ఆవేశంగా శాంపిల్స్ ఇచ్చేశాడట. ఇప్పుడు ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్టులో ఏదన్నా తేడా కొడితే మాత్రం.. అతగాణ్ణి 'బాధితుడు' అంటే బోర్డేసి మరీ మీడియా వాళ్ళు ఊరేగిస్తారేమో అని టెన్షన్ పడుతున్నాడట.

ఏదేమైనా కూడా డ్రగ్స్ కేసులో ఈ 12 మందికీ నోటీసులు అందితే అందాయి కాని.. ఇంకో రౌండ్ నోటీసుల పర్వం మాత్రం ఉండకపోవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ నోటీసులు కారణంగా టాలీవుడ్ అతలాకుతలం అయిపోవడంతో.. అసలు ఇలా నోటీసులిచ్చే కార్యక్రమం కాస్త కంట్రోల్ లో పెట్టాలని డిసైడయ్యారట యంత్రాంగంలోని పెద్దలు.