Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్.. పాస్ పోర్ట్.. సూపర్ స్టార్ కొడుకు క‌థేంటి?

By:  Tupaki Desk   |   14 July 2022 6:30 AM GMT
డ్ర‌గ్స్.. పాస్ పోర్ట్.. సూపర్ స్టార్ కొడుకు క‌థేంటి?
X
కింగ్ ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ అనూహ్యంగా డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌డం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్ ని ఎన్.సి.బి అరెస్టు చేసి విచారించింది. అయితే ఈ విచార‌ణ‌లో ఆర్య‌న్ తాను నిర‌ప‌రాధిని అని నిరూపించుకున్నాడు. కోర్టుల నుంచి అత‌డి వైపు పాజిటివిటీ క‌నిపించింది.

తాజాగా ఆర్య‌న్ ఖాన్ పాస్ పోర్ట్ ను విడుదల చేయాలని ముంబై కోర్టు NCBని ఆదేశించింది. 27 మే 2022న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు అయింఇ. దాదాపు ఎనిమిది నెలల తర్వాత క్రూయిజ్ నార్కోటిక్స్ కేసులో క్లీన్ చిట్ పొందారు. 2021 అక్టోబరు 02న అరెస్టయిన తర్వాత ఆర్యన్ ను ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. కొన్ని రోజుల క్రితం స్టార్ కిడ్ తన పాస్ పోర్ట్ ను తిరిగి పొందడానికి ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 30 గురువారం తన లాయర్లు అమిత్ దేశాయ్ - రాహుల్ అగర్వాల్ ...లు దేశాయ్ కారింజీ -ముల్లా ద్వారా దరఖాస్తు దాఖలు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి.

తీవ్ర ఆవేద‌న‌తో ర‌గిలిపోయిన ఖాన్ ఇటీవ‌ల డ్రగ్స్ బస్ట్ కేసులో అరెస్టయిన అనంత‌రం చాలా కాలానికి షారూక్‌ వార‌సుడు ఆర్యన్ ఖాన్ మౌనం వీడాడు. నా ప్ర‌తిష్ట‌ను మంట క‌లిపారు అంటూ అధికారులపై విరుచుకుప‌డ్డాడు. తాను క‌ల‌త చెందాన‌ని ఒక మీడియా లైవ్ లో వెల్ల‌డించాడు

షారూఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట గారాల సుపుత్రుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని గత ఏడాది హెడ్ లైన్స్ లోకి వ‌చ్చాడు. ఈ కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే.. 2021అక్టోబర్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించి కొంద‌రిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంది. 2 అక్టోబరు 2021 రాత్రి ఆర్యన్ తో పాటు మరికొంతమందిని నార్కోటిక్స్ బృందం అదుపులోకి తీసుకుంది. బెయిల్ పై విడుదల చేయడానికి ముందు అర్య‌న్ ని 28 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. 2022 మేలో తగిన సాక్ష్యాధారాలు లేనందున క్రూయిజ్ డ్రగ్ బస్ట్ కేసులో ఎన్సీబీ ఆర్యన్ కి క్లీన్ చిట్ ఇచ్చింది.

కానీ చాలా కాలానికి 23 ఏళ్ల ఆర్య‌న్ ఇప్పుడు దీనిపై బ‌హిరంగంగా మాట్లాడాడు. త‌ప్పు దొర‌క‌లేదు.. కానీ త‌న‌ ప్రతిష్టను దిగ‌జార్చార‌ని ఆందోళన చెందాడు. మీరు చాలా పెద్ద త‌ప్పు చేశారు! అంటూ తీవ్ర స్వరంతో ఆర్య‌న్ ఎన్.సి.బి అధికారిపై టీవీ చానెల్ లైవ్ లో విరుచుకుప‌డ్డాడు. నా ప్ర‌తిష్ఠ‌ను మంట క‌లిపార‌ని ఆవేద‌న చెందాడు.

అరెస్ట్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందనే దానిపై ఓపెన‌య్యాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి నేతృత్వం వహిస్తున్న NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రాజ్ చెంగప్ప- సంజయ్ సింగ్ రాసిన 'లెసన్స్ ఫ్రమ్ ది ఆర్యన్ ఖాన్ కేస్' అనే కవర్ స్టోరీని ఇండియా టుడే మ్యాగజైన్ ఆవిష్కరించ‌గా.. అందులో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూసాయి. ఆర్యన్ ఖాన్ తో సంజయ్ సింగ్ చేసిన సంభాషణలో ఆర్యన్ సిట్ అధికారిని ఇలా అడిగాడు.

"సార్ .. మీరు నన్ను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికర్ గా చిత్రించారు. నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు నిధులు సమకూరుస్తాను అని అన్నారు. ఈ ఆరోపణలు అసంబద్ధం కాదా? నాతో ఎలాంటి డ్రగ్స్ ఉన్న‌ట్టు కనుగొనలేదు. అయినప్పటికీ నన్ను అరెస్టు చేశారు. సార్.. మీరు నా విషయంలో చాలా తప్పు చేసారు. నా ప్రతిష్టను నాశనం చేసారు. నేను ఇన్ని వారాలు జైలులో ఎందుకు గడపవలసి వచ్చింది? నేను నిజంగా దానికి అర్హుడినా?" అని ప్ర‌శ్నించాడు. ఒక ర‌కంగా అత‌డి స్వ‌రంలో ఆవేద‌న క‌నిపించింది.

ఇంత‌కుముందు ఆర్య‌న్ ఆరెస్ట్ స‌మ‌యంలో తన కొడుకు మానసిక క్షేమం గురించి షారూఖ్ ఖాన్ కూడా ఆందోళన చెందుతున్నాడని.. అతని కొడుకు సరిగ్గా నిద్రపోవడం లేదని సంజయ్ సింగ్ వెల్లడించాడు. ఆర్యన్ ఖాన్ తో సహవాసం చేయడానికి రాత్రిపూట అతని బెడ్ రూమ్ కి వెళ్తానని ఖాన్ అన్న‌ట్టు సంజ‌య్ సింగ్ ఇంత‌కుముందు చెప్పాడు. "సమాజాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన పెద్ద నేరస్థులు లేదా రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించారు. మేము ప్రతిరోజూ కఠినమైన దినాల‌ను అనుభవిస్తున్నాము" అని SRK దాదాపు కన్నీళ్లతో క‌నిపించాడ‌ని సింగ్ వెల్లడించాడు.

ఈ ఏడాది మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆర్యన్ ఖాన్ పెద్ద కుట్రలో భాగం కాదని నివేదించింది. ఆర్యన్ ఖాన్ భారీ డ్రగ్స్ కుట్రలో లేదా అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ సిండికేట్ లో భాగమని చెప్ప‌డానికి ఎటువంటి ఆధారాలు లేవని సిట్ పేర్కొంది.

జాతీయ మీడియా ప్ర‌కారం.. ఆర్యన్ ఖాన్ ఎప్పుడూ డ్రగ్స్ ను త‌న‌తో ఉంచుకోలేదు. చాటింగులు చేయ‌లేదు. అందువల్ల అతని ఫోన్ తీసుకొని అతని చాట్ లను తనిఖీ చేయవలసిన అవసరం లేదు. రెగ్యుల‌ర్ చాట్ లు ఖాన్ ఏ అంతర్జాతీయ సిండికేట్ లో భాగమని సూచించలేదు. అందుకే NCB మాన్యువల్ ద్వారా తప్పనిసరి అయినట్లుగా వీడియోను రికార్డ్ చేయలేదు. ఈ కేసులో అరెస్టయిన బడా డ్ర‌గ్ డీల‌ర్స్ నుండి రికవరీ చేసిన డ్రగ్స్ సింగిల్ రికవరీగా మాత్ర‌మే చూపించారు. ఎక్క‌డా ఆర్య‌న్ ఖాన్ పేరు లేదు.. అని జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.