Begin typing your search above and press return to search.

అందాలను దాచనంటూ ఆరబోత

By:  Tupaki Desk   |   24 Jan 2022 7:41 AM GMT
అందాలను దాచనంటూ ఆరబోత
X
జన్నత్‌ సినిమాతో దాదాపు పదేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఈషా గుప్త. ఈ అమ్మడు సినిమాలు మాత్రమే కాకుండా బుల్లి తెర మరియు ఓటీటీ ఇంకా మ్యూజిక్ ఆల్బం ఇలా పలు రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూనే వస్తుంది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయినా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌ లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి అక్కడ హాట్ బ్యూటీ ఇమేజ్ ను దక్కించుకుంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇటీవల అందాల విందు విషయమై ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందంగా ఉన్నప్పుడు చూపిస్తే ఏమవుతుంది.. అందంను అందరికీ చూపిస్తేనే కదా క్రేజ్ వస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తన అందాల ప్రదర్శణతో ముద్దుగుమ్మ ఈషా గుప్త రెగ్యులర్‌ గా నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పర్పుల్‌ గౌన్ లో హాట్ ఫోజ్‌ లు ఇస్తూ ఆకట్టుకుంది. నెట్టింట ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

మొదటి సినిమా నుండి అందాల విందు చేస్తున్న ఈ డస్కీ బ్యూటీ ముందు ముందు మరింతగా అందాల ఆరబోతకు సిద్ధం అన్నట్లుగా తాజా కామెంట్స్ తో చెప్పకనే చెప్పింది. ఈ అమ్మడు నెట్టింట చేస్తున్న హడావుడి గురించి అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. సినిమాలతో ఎంతగా బిజీ ఉన్నా కూడా ఈ అమ్మడు ఇలాంటి అందాల ఆరబోత ఫొటో షూట్‌ లు కామన్ గా చేస్తూనే ఉంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.