Begin typing your search above and press return to search.
సల్మాన్ ఖాన్ తో DSP విభేధాలు నిజమేనా?
By: Tupaki Desk | 3 July 2022 4:52 AM GMTక్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దేవి శ్రీ ప్రసాద్- సల్మాన్ ఖాన్ ఒకరికొకరు దూరమయ్యారని ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ కలిసి పని చేయబోవడం లేదు. కభీ ఈద్ కభీ దీపావళి కోసం ఈ జోడీ కలిసి పని చేస్తారని ఆరంభం కథనాలొచ్చినా ఆ తర్వాత బ్రేకప్ అయ్యిందని వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ ఇది నిజమా? ఇరువురి నడుమా క్రియేటివ్ డిఫరెన్సెస్ కి లైన్ క్లియర్ కాలేదా? అంటే .. ఎందుకు కాలేదు!? ఇటీవల ఇవన్నీ షార్ట్ ఔట్ అయ్యాయి. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి పని చేసేందుకు ఒప్పందం కుదిరింది. అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి బయటకు రాలేదు. తాజాగా మరో లీక్ ప్రకారం.. రాపర్-సింగర్ యో యో హనీ సింగ్ తో కలిసి దేవీశ్రీ ప్రసాద్ పని చేయనున్నారని తెలిసింది. వాస్తవానికి ఈ ముగ్గురి కలయికలో ఒక పాట రాబోతోంది. ఇది క్రేజీగా హై పంచ్ తో ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరంగా యోయో హనీ సింగ్ - దేవి శ్రీ ప్రసాద్ ఒక పాట కోసం కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. సల్మాన్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దేవీశ్రీ స్పెషల్ సాంగ్ అంతే హైలైట్ గా ఉంటుందని కూడా వినిపిస్తోంది.
సల్మాన్ తాజా భారీ బడ్జెట్ చిత్రాన్ని పూర్తి వినోదాత్మక పంథాలో మలచడానికి ఉన్న ఎటువంటి అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. అన్ని ఎలిమెంట్స్ ప్యాకేజీతో పక్కా కమర్షియల్ పంథాలో రూపొందించడానికి సల్మాన్ పక్కా ప్రణాళికతో ఉన్నారు. సంగీతం సహా ఏ విషయంలోనూ రాజీ పడకూడదని అతను భావిస్తున్నాడని తెలిసింది.
ఆసక్తికరంగా కబీ ఈద్ కబీ దీపావళి(వర్కింగ్ టైటిల్)లో రామ్ చరణ్ - వెంకటేష్ దగ్గుబాటి తో కలిసి సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ సాంగ్ ని చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఆల్బమ్ లోని ఒక ముఖ్యమైన పాట.. దీని సెట్ నుంచి లీకులు అందడాన్ని ఆపడం కష్టమేనని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దేవీశ్రీ- సల్మాన్ జోడీ ఇటు సౌత్ అటు నార్త్ స్టార్లను కలుపుతూ ఒక ప్రత్యేక గీతానికి ప్లాన్ చేయడం ఆసక్తిని పెంచుతోంది.
అలాగే ఈ సినిమా టైటిల్ గురించి కూడా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. కభీ ఈద్ కభీ దీపావళి తో పాటు భాయిజాన్ అనే టైటిల్ కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ టైటిల్ ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. సిద్ధార్థ్ నిగమ్- జాస్సీ గిల్- రాఘవ్ జుయల్ - షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. సహనిర్మాత సాజిద్ నడియావాలా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సల్మాన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ దీనికి కారణం. అలాగే సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని కథనాలొచ్చాయి.