Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో DSP మ‌ళ్లీ జాక్ పాట్

By:  Tupaki Desk   |   16 Sep 2022 11:30 PM GMT
బాలీవుడ్ లో DSP మ‌ళ్లీ జాక్ పాట్
X
రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కేవ‌లం టాలీవుడ్ వ‌ర‌కే కాదు అత‌డికి త‌మిళం -హిందీలోనూ బోలెడంత డిమాండ్ ఉంది. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. స‌మ‌కాలీన సంగీత ద‌ర్శ‌కుల్లో దేవీశ్రీ యూనిక్ ట్యాలెంట్ గురించి నిరంత‌రం యువ‌త‌రంలో చ‌ర్చ సాగుతుంటుంది.

సామ్ కి గొప్ప క్రేజ్ తెచ్చిన ఊ అంటావా పాట‌కు దేవీశ్రీ స్వ‌ర‌క‌ర్త‌. పుష్ప చిత్రంతో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ అందించి పాన్ ఇండియా లెవ‌ల్లో స‌త్తా చాటిన దేవీశ్రీ ప్ర‌సాద్ త‌దుప‌రి స‌ల్మాన్ భాయ్ సినిమాల‌కు ఐట‌మ్ నంబ‌ర్ల‌ను కంపోజ్ చేస్తున్నాడు. స‌ల్మాన్ గ‌త చిత్రాల‌కు అత‌డు పెప్పీ నంబ‌ర్ల‌ను అందించి సినిమాల విజ‌యానికి ఎంతో స‌హ‌క‌రించాడు.

ఇప్పుడు దేవీశ్రీ మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని ద‌క్కించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న 'దృశ్యం 2'కి సంగీత ద‌ర్శకుడిగా అవ‌కాశం అందుకున్నాడు. అజయ్ దేవగన్- శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన రీమేక్ మూవీ 'దృశ్యం 2' పై అంచ‌నాలు పెంచేందుకు దేవీశ్రీ చేరిక స‌హ‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

శ్రీవల్లి -ఊ అంటావా లాంటి భారీ హిట్ లను అందించిన‌ సంగీత స్వరకర్తగా దేవీశ్రీ రేంజు వేరే లెవ‌ల్లో ఉంది. 2021-22లో అతడి పేరు మార్మోగింది. త‌దుప‌రి 'పుష్ప 2' సహా రూల్ - బవాల్- సూర్య 42 లాంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

నిజానికి మ‌ల‌యాళ వెర్ష‌న్ దృశ్యం 2 కి అనిల్ జాన్సన్ సంగీతాన్ని అందించ‌గా.. ఇటీవలి కాలంలో దేవీశ్రీ‌ భారీ హిట్ లను పరిగణనలోకి తీసుకుని నిర్మాతలు త‌న‌ని ఎంపిక చేస్తున్నార‌ని తెలిసింది.

దృశ్యం 2 లో టబు- శ్రియా శరణ్ - ఇషితా దత్తా సహా పార్ట్ 1 తారాగణం అంతా న‌టిస్తున్నారు. మొద‌టి భాగంలోని సంఘటనల తర్వాత 7 సంవత్సరాలకు దృశ్యం 2 ప్రారంభమవుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే విజయ్ సంకల్పం నెగ్గిందా లేదా? ప‌రీక్ష‌లో అత‌డు పాస‌య్యాడా లేదా? అన్న‌దే ఈ సినిమా. క్రైమ్-థ్రిల్లర్ జానర్ కు సాధ్యమైన అన్ని విధాలుగా న్యాయం అందించడమే ఈ చిత్రం లక్ష్యం.

వయాకామ్ 18 సమర్పణలో గుల్షన్ కుమార్- T-సిరీస్ .. పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్.. కుమార్ మంగత్ పాఠక్.. అభిషేక్ పాథక్.. క్రిషన్ కుమార్ నిర్మాత‌లు. సంజీవ్ జోషి.. ఆదిత్య చౌక్సే - శివ్ చననా సహ నిర్మాతలు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.