Begin typing your search above and press return to search.
క్లాస్ - మాస్ కాంబోలో మాస్ రాజా 'ధమాకా' సాంగ్..!
By: Tupaki Desk | 25 Nov 2022 12:32 PM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''ధమాకా''. 'డబుల్ ఇంపాక్ట్' అనే ట్యాగ్ లైన్ తో త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇదివరకే 'ధమాకా' నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే 'జింతాక్' - 'మాస్ రాజా' మరియు 'వాట్స్ హ్యాపెనింగ్' పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. ఇవి యూట్యూబ్ లో మిళియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సినిమాలోని 'డు డు డు' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసారు.
'వీడు ఎగబడి తెగబడి కలబడి గెలిచే మాస్.. వాడు మనసును మెదడును పదునుగా విసిరే క్లాస్..' అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. సినిమాలో రవితేజ క్యారక్టర్ ఏంటనేది ఈ పాటలో తెలియజెప్పే ప్రయత్నం చేసారు. క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ ని అలరించే ఈ సాంగ్ లో రవితేజ స్వాగ్ ని మనం చూడొచ్చు. ఇది మాస్ రాజా ఫ్యాన్స్ కి మాసివ్ ఫీస్ట్ అని చెప్పాలి.
రవితేజకు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో 'డు డు' పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. గీత రచయిత సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి హీరో పాత్రని ఎలివేట్ చేసే లిరిక్స్ అందించారు. యువ గాయకుడు పృథ్వీ చంద్ర ఎంతో హుషారుగా ఈ పాట పాడారు.
భారీ సెటప్ లో చిత్రీకరించిన 'డు డు' సాంగ్ విజువల్ గానూ ఆకట్టుకుంది. రవితేజ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. కార్తీక్ ఘట్టమనేని దీనికి సినిమాటోగ్రఫీని నిర్వహించగా.. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు.
'ధమాకా' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు సమకూర్చారు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న 'ధమాకా' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది 'ఖిలాడీ' మరియు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో నిరాశ పరిచిన రవితేజ.. ఈ మూవీతో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.