Begin typing your search above and press return to search.
ట్రెండ్: డబుల్ బొనాంజా ఇవ్వడమే క్రేజ్
By: Tupaki Desk | 10 Aug 2015 5:46 PM GMTడబుల్ యాక్షన్... సినిమా ఇండస్ట్రీలో ఈ కాన్సెప్ట్ తో సినిమాలు గతంలో అరుదుగా వచ్చేవి. పిక్చరైజేషన్ లో ఉన్న ఇబ్బందులు, స్టోరీ డిమాండ్ చేయడంవంటి కారణాలతో... డబుల్ ధమాకా చూపించేదుకు కాస్త వెనకాడేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. డైరెక్టర్లు కొత్త కాన్సెప్టులతో ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నారు. ఇంకేం యాక్టర్లు కూడా తమ డబుల్ ట్యాలెంట్ చూపించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
బాహుబలి, మనం, మగధీర.. టాలీవుడ్ లో ఇవన్నీ నటీనటులను ఇద్దరిద్దరు చొప్పున చూపించి సక్సెస్ కొట్టేసిన సినిమాలే. ఈ ట్రెండ్ ఎప్పుడో పాత తరం సినిమాల నుండీ ఉందిలేండి. బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ బాగానే ఉందిప్పుడు. తను వెడ్స్ మనులో కంగనా, అలోన్ లో బిపాషా డ్యుయల్ రోల్స్ తో సత్తా చాటారు. ఇంకా ద్విపాత్రాభినయంతో రాబోయే సినిమాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇందులో టాప్ స్టార్స్ కూడా ఉండడం విశేషం. సల్లూభాయ్ తో బరజాత్యా తీస్తున్న ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీలో... సల్మాన్ ఖాన్ రెండు పాత్రలు చేస్తున్నాడు. ఫ్యాన్ సినిమాలో.. షారూక్ ఖాన్ స్టార్ గానీ, ఫ్యాన్ గాను డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కూడా మస్తీజాదే లో డబుల్ అందాలు చూపించనుంది.
చూస్తుంటే... ఇప్పుడు డ్యుయల్ రోల్ కొత్త ట్రెండ్ అయిపోయినట్లుంది. యాక్టర్లో ట్యాలెంట్ బయటకు తీస్తు... ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టెయిన్మెంట్ పంచేదుకు... ఈ తరహా సినిమాలు బాగా ఉపయోగపడుతున్నాయి. సక్సెస్ కూడా అవుతున్నాయి.