Begin typing your search above and press return to search.

ఈ ఫ్రేం అంటే ఎంత క్రేజో

By:  Tupaki Desk   |   31 Dec 2017 10:13 AM GMT
ఈ ఫ్రేం అంటే ఎంత క్రేజో
X
కొన్ని స్పాట్స్ టూరిస్ట్ లకే కాదు హీరొయిన్ లకు కూడా భలే క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి దుబాయ్ లో నెలకొల్పిన గోల్డ్ ఫ్రేం. అరబ్ దేశం తమకు గర్వకారణంగా భావించే బూర్జ్ ఖలీఫా - పాం జుమేరియా తర్వాత దీన్నే తమ ఫేవరేట్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకుంటోంది. 150 మీటర్ల పొడవు - 93 మీటర్ల వెడల్పు ఉండే ఈ ఎత్తైన ఫ్రేం ముందు నిలబడితే ఎవరికైనా రాజసం ఉట్టి పడుతుంది. ఇది ఊరికే నిలబడి ఫోటోలు దిగడానికి కాదు లెండి. పైకి వెళ్ళడానికి అనుసంధానించిన గ్లాస్ బ్రిడ్జ్ సహాయంతో వెళ్తే పాత దుబాయ్ తో పాటు కొత్త నగరాన్ని ఆకాశ యానం నుంచి చూడొచ్చు. అయితే ఇది ఫ్రీ మాత్రం కాదు. యాభై ఎమిరేట్ దిరామ్స్ చెల్లించాలి. ఇది దుబాయ్ లోనే అత్యంత రద్దీ ఉన్న పర్యాటక ప్రదేశంగా పేరున్న జలీల్ పార్క్ లో దీన్ని ప్రతిష్టించారు.

దీని దగ్గర ఇటీవలే బాలకృష్ణ - నయనతార పాల్గొన్న సాంగ్ షూటింగ్ జైసింహ సినిమా కోసం చేసారు. ఆ సందర్భంగానే నయనతార గోల్డ్ ఫ్రేం ముందు ఫోటో దిగి షేర్ చేసుకుంది. కొద్ది రోజుల క్రితం రాశి ఖన్నా కూడా తన తల్లితో అక్కడ తీసుకున్న పిక్ షేర్ చేస్తే బాగా వైరల్ అయ్యింది. అసలే డబ్బులు వరదలా పారే దేశం. అందులోనూ బంగారం అంటే అక్కడి వాళ్ళకు బిస్కెట్లు కొన్నంత ఈజీ. అలాంటప్పుడు ఇలాంటి గోల్డ్ ఫ్రేమ్స్ సెట్ చేయటం విశేషమేమి కాదు లేండి. త్వరలో ప్రభాస్ కూడా ఇక్కడ సందడి చేయనున్నాడు. సాహో షూటింగ్ కోసం అక్కడ అనుమతులు ఆలస్యమైన నేపధ్యంలో ఫిబ్రవరిలో జరిపే అవకాశాలు ఉన్నాయి. మీకూ ఏ మాత్రం ఛాన్స్ ఉన్న గోల్డ్ ఫ్రేంలోకి వెళ్లి రండి.