Begin typing your search above and press return to search.

హిందీ ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్ మాత్రమేనా?

By:  Tupaki Desk   |   16 Dec 2021 6:33 AM GMT
హిందీ ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్ మాత్రమేనా?
X
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి సందర్బంగా జనవరి 7న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అయినా కూడా ప్యాచ్ వర్క్‌ వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ వర్షన్ కు ఎన్టీఆర్ తన డబ్బింగ్‌ చెప్పాడు. మొదట ఎన్టీఆర్‌ పాత్ర కోసం హిందీలో వేరే వ్యక్తితో డబ్బింగ్‌ చెప్పించాలనే ఆలోచన చేశారనే వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఎన్టీఆర్ స్వయంగా హిందీ కొమురం భీమ్‌ పాత్రకు కూడా డబ్బింగ్‌ చెప్పాడు.

ఎన్టీఆర్‌ హిందీ వర్షన్ కు డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో బయటకు వచ్చింది. కాని రామ్‌ చరణ్‌ డబ్బింగ్ చెబుతున్న ఫొటో బయటకు రాలేదు. దాంతో ఎన్టీఆర్ మాత్రమే హిందీ వర్షన్ కు డబ్బింగ్‌ చెప్పాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందీ లో మన హీరోలు డబ్బింగ్‌ చెప్పడం చాలా అరుదుగా ఉంటుంది. ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఇద్దరు కూడా గతంలో హిందీలో డబ్బింగ్‌ చెప్పిందే లేదు. కనుక వీరిద్దరు అక్కడ డబ్బింగ్‌ చెప్తే ఎలా ఉంటుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ లో వినిపించిన వాయిస్‌ కు మంచి స్పందన వస్తుంది. కనుక ఎన్టీఆర్‌ కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ కూడా హిందీ వర్షన్‌ కు డబ్బింగ్‌ చెప్పాడు లేదంటే చెప్తాడు అనే వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్ కూడా హిందీ బాగానే మాట్లాడుతాడు. కనుక ఆయన తో డబ్బింగ్ చెప్పించడం మంచి నిర్ణయం అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట. అతి త్వరలోనే ఈ విషయమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆలియా భట్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్‌ అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. బాహుబలి రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఆర్ ఆర్‌ ఆర్‌ పై అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. బాహుబలి ని మించిన అంచనాలతో రాబోతున్న ఈ సినిమా అన్ని ఇండియన్ భాషల్లో నే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేస్తామంటున్నారు.