Begin typing your search above and press return to search.
ఈ వారం రిలీజులు అక్కడ బేరమన్నాయ్
By: Tupaki Desk | 8 Nov 2016 2:23 AM GMTఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోవడం కనిపిస్తూనే ఉంది. డజన్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేసినా కౌంటర్లలో కాసులు మాత్రం రాలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ మధ్య ఇంపార్టెంట్ మార్కెట్ గా మారిపోయిన యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఇదే పరిస్థితి. అన్నీ అక్కడ విడుదల కాకపోయినా.. రిలీజ్ అయిన మూవీస్ కూడా నిరుత్సాహపరిచేశాయి.
ఈ శుక్రవారం రిలీజ్ లలో నరుడా డోనరుడాపై ఆసక్తి ఉంటుందని అంతా భావించారు. ట్రెండీ సబ్జెక్ట్ పై తెరకెక్కిన మూవీ కావడంతో.. యూఎస్ ఆడియన్స్ ను మెప్పించచ్చనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ కి సమస్యలు రావడం.. ఒక రోజు లేట్ గా విడుదల కావడం లాంటి ప్రాబ్లెమ్స్ ని అధగిమించి.. ధియేటర్లలోకి వచ్చినా.. తొలి వీకెండ్ పూర్తయ్యే సమయానికి డోనరుడుకి 4000 యూఎస్ డాలర్లు మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 2లక్షల 60వేల రూపాయలు మాత్రమే.
ఇక ఆర్పీ పట్నాయక్ నటించిన మనలో ఒకడు చిత్రం అయితే.. శుక్రవారం తొలి షోకి కేవలం 60 డాలర్లు(రూ. 3,900) వచ్చాయి. ఈ దెబ్బకి రెండో షో కూడా వేయకుండా స్క్రీనింగ్ ఆపేశారు. చైతు ప్రేమమ్ (8.30లక్షల డాలర్లు)తర్వాత ఇప్పటివరకూ యూఎస్ తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే సినిమా ఏదీ రిలీజ్ కాలేదు.