Begin typing your search above and press return to search.
మహానటిలో అతని పని పూర్తయ్యింది
By: Tupaki Desk | 18 Jan 2018 8:05 AM GMTటాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి ఒక మహానటి జీవిత కథ తెరపై చూడటానికి సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహానటి సావిత్రి బయోపిక్ షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తోన్న ఈ ప్రయోగంపై భారీ అంచనాలు ఉన్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే గత కొంత కాలంగా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఎక్కువగా దర్శకుడు ఆ కాలం నాటి సెట్స్ వేసి షూటింగ్ ని నిర్వహించాడు. ఇక సినిమాలో సమంత తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే. జెమినీ గణేషన్ పాత్రలో కనిపిస్తోన్న దుల్కర్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం అయిపోయింది. అయితే మొన్నటి వరకు హీరోగా అలరించిన దుల్కర్ ఇప్పుడు కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయబోతున్నాడు. సావిత్రి జీవితంలో కోలీవుడ్ హీరో జెమినీ గణేషన్ పాత్ర చాలా కీలకమైంది. ఆయన వల్లే సావిత్రి జీవితం ఒక్కసారిగా తలక్రిందులైందని చెబుతుంటారు. మరి అలాంటి డిఫెరెంట్ క్యారెక్టర్ ని మనోడు ఎలా బ్యాలెన్స్ చేశాడు అనేది తెరపై చూడాలి.
అలాగే నాగ్ అశ్విన్ టేకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటివరకు సావిత్రి బయోపిక్ కి ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఎక్కువగా కాంట్రావర్షియల్ కూడా కాలేదు. అలాంటి వాటికి తావివ్వకుండా చిత్ర యూనిట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. వీలైనంత త్వరగా స్పెషల్ టీజర్ ద్వారా ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇక సినిమాను మార్చ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.