Begin typing your search above and press return to search.
మహానటి కోసం సొంత గొంతుతో..
By: Tupaki Desk | 26 March 2018 4:18 AM GMTఓ సినిమాలో.. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పక్క భాషల నటులు ఎక్కువగా కనిపించడం ఆనవాయితీ. ఒక్కోసారి క్రేజ్ కోసం .. కొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు సావిత్రి జీవితంపై రూపొందుతున్న బయోపిక్ మహానటిలో కూడా పలువురు ఇతర భాషల నటులు కనిపించడం సహజమే. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.
సూపర్ స్టార్ మమ్ముట్టికి కుమారుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినా డీక్యూకు విపరీతమైన క్రేజ్ ఉందంటే అందుకు కారణం.. అతడిలోని అపారమైన ప్రతిభే. అదే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతడిని దగ్గర చేసింది. ఇప్పుడు మహానటి కోసం ఇతడు తెగ కష్టపడిపోతున్నాడు. ఆ విషయాన్ని తనే చెబుతున్నాడు. అదేంటీ.. షూటింగ్ అయిపోయిందని మహానటి టీం పార్టీ కూడా చేసుకుంది కదా.. ఇప్పుడు మళ్లీ దుల్కర్ ఎందుకు కష్టపడుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఇవి డబ్బింగ్ స్టూడియో కష్టాలు.
కెమేరా ముందు యాక్టింగ్ చేసేస్తూ.. ఏదో ఒక భాషలో ఆ ఫీల్ ను కన్వే చేస్తూ కవర్ చేస్తారు తారలు. కానీ అదే ఫీల్ ఆడియన్స్ కలగాలంటే డబ్బింగ్ కరెక్టుగా రావాలి. ఈ మధ్య కాలంలో ఇతర తారలు తమ గొంతు తామే వినిపిస్తున్నట్లుగానే..హానటి కోసం తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. అయితే.. తను పరీక్షల కోసం కోసం కూడా ఎప్పుడూ ఇంత కష్టపడ్డం లేదని అంటున్నాడు. తెలుగులో తొలిసారిగా డబ్బింగ్ చెప్పడానికి తన సర్వశక్తులు ఒడ్డుతున్నానంటూ.. డబ్బింగ్ స్టూడియో నుంచి కొన్ని పిక్స్ పోస్ట్ చేశాడు ఈ మలయాళ హీరో.