Begin typing your search above and press return to search.

దుల్కర్‌ తెలుగు లో సెటిల్‌ అయినట్లే.. ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   13 Aug 2021 3:18 AM GMT
దుల్కర్‌ తెలుగు లో సెటిల్‌ అయినట్లే.. ఇదే సాక్ష్యం
X
తమిళంకు చెందిన పలువురు హీరోలు తెలుగు లో మంచి మార్కెట్‌ ను కలిగి ఉన్నారు. వారి భాషలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా వారి సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అవుతుంది.. తద్వార భారీ మొత్తంలో బిజినెస్ కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆ హీరోల సినిమాలకు తెలుగు లో కూడా భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం తమిళంకు చెందిన కొద్ది మంది హీరోలు మాత్రమే తెలుగు లో క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఇతర భాషలకు చెందిన ఏ ఒక్క హీరో కూడా తెలుగు లో సత్తా చాట లేక పోతున్నాడు అనుకుంటున్న సమయంలో మలయాళ యంగ్‌ స్టార్‌ దుల్కర్ సల్మాన్‌ తెలుగు లో మంచి ఫాలోయింగ్‌ ను దక్కించుకున్నాడు. మహానటితో పాటు కొన్ని డబ్బింగ్‌ సినిమాల వల్ల దుల్కర్‌ కు తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా తెలుగు అమ్మాయిల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది.

ఆ క్రేజ్‌ ను సద్వినియోగం చేసుకోవడంకు గాను మలయాళంలో ఆయన నటించిన సినిమాలను తెలుగు లో డబ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన నటించిన సినిమాను తెలుగు లో కురుప్ గా విడుదల చేయడం జరిగింది. కురుప్‌ సినిమా ను తెలుగు లో విడుదల చేయడం కోసం టీజర్‌ ను విడుదల చేశారు. కురుప్ టీజర్‌ కు వచ్చిన రెస్పాన్స్ అందరికి షాకింగ్ గా ఉంది. అతి తక్కువ సమయంలోనే మిలియన్‌ వ్యూస్ ను తెలుగు వ్యూవర్స్ యూట్యూబ్‌ లో ఇచ్చేశారు.

ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా తెలుగు వర్షన్ లో దక్కించుకోని టీజర్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ ను కురుప్‌ దక్కించుకుంది. రెండు మిలియన్‌ ల వ్యూస్ ను కురుప్ చేరువ అయ్యింది. దుల్కర్‌ సల్మాన్‌ యూట్యూబ్‌ ఛానెల్ లో షేర్‌ అయిన కురుప్‌ టీజర్‌ కు దక్కిన స్పందన ఆయన కు తెలుగు లో ఉన్న స్టార్‌ డంను చెపిస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగు ఆయన మరింత బిజీ అవ్వడం ఖాయం.. తెలుగు నాట ముందు ముందు దుల్కర్‌ సల్మాన్‌ వరుస సినిమాలతో స్టార్‌ గా నిలుస్తాడనే నమ్మకంను కూడా ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.