Begin typing your search above and press return to search.
`బంగారం` పాన్ ఇండియా ట్రయల్ ఫలించేనా?
By: Tupaki Desk | 25 Oct 2021 4:34 AM GMTమాలీవుడ్ యువహీరో దుల్కార్ సల్మాన్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఓకే బంగారం చిత్రంతో అతడికి తెలుగు- యువతలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత మహా నటిలో జెమినీ గణేషన్ పాత్రతో ఆకట్టుకున్నాడు దుల్కార్. అటుపై అతను నటించిన సినిమాలు ఇక్కడా తరుచూ అనువాదమవుతోన్న సంగతి తెలిసిందే. `కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లయడిత్తాల్`.. `వరణ ఆవశ్యమందు` సినిమాలు మాతృకతో పాటు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో దుల్కార్ ఈసారి పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన `కురుప్పు` అనే చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు..తమిళ్..కన్నడం..హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.
నవంబర్ 12న థియేటర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాల్ని క్రియేట్ చేసాయి. `సుకుమార కురుప్పు` అనే ఓ సంచలన వ్యక్తి కథ కావడం విశేషం. కేరళ పోలీసుల్ని ముప్పుతిప్ప లు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన ఓక్రిమినల్ స్టోరీ ఇది. 1984 లో ఇన్నురెన్స్ డబ్బుల కోసం చాకో అనే యువకుడ్ని కారులో బంధించి పెట్రోలు పోసి తగలబెట్టి తానే చనిపోయినట్లు పోలీసుల్ని నమ్మించాడు కురుప్పు. అప్పటి నుంచి ఇప్పటివర కూ ఈకే సు ఇన్వస్టిగేషన్ జరుగుతూనే ఉంది. కురుప్పు ఇప్పటికీ పోలీసులకు పట్టుబడలేదు.
చాకో చనిపోయి తల్లిదండ్రుల్ని శోక సంద్రంలో ముంచితే కురుప్పు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇందులో సుకుమార కురుప్పుగా దుల్కార్ సల్మాన్ నటిస్తున్నాడు. ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని యూనిట్ తెలిపింది. దుల్కార్ కి నటుడిగా మంచి పేరు తీసుకొస్తుందని అంటున్నారు. ఇందులో తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ హీరోయిన్ గా నటించింది. శ్రీనాధ్ రాజేంద్ర న్ దర్శకత్వం వహించాడు. దుల్కార్ సల్మాన్ సొంత నిర్మాణ సంస్థ వేఫరర్ బ్యానర్ చిత్రాన్ని నిర్మిచింది.