Begin typing your search above and press return to search.
‘మహానటి’లో అతడిని మరిచిపోకండి
By: Tupaki Desk | 14 May 2018 11:30 PM GMTగత ఐదారు రోజుల నుంచి తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘మహానటి’ మీదే ఉంది. ఆ సినిమాను పొగడని ప్రేక్షకుడు లేడు. దాని గురించి నెగెటివ్ గా మాట్లాడేవాళ్లే లేరు. ఇందులో చెప్పుకోవడానికి చాలా హైలైట్లు ఉన్నాయి. ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. ఐతే నటీనటుల్లో అందరి చర్చలూ కీర్తి సురేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆమె సావిత్రి పాత్రలో అంత అద్భుతంగా నటిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సినిమా ముందు వరకు కీర్తి నటిగా పెద్దగా రుజువు చేసుకున్నది లేదు. చేసినవి చాలా మామూలు పాత్రలే. సావిత్రి పోలికలైతే ఉన్నాయి కానీ.. నటనలో ఆమెను కీర్తి మ్యాచ్ చేయగలదా అని అందరూ సందేహించారు. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ అద్భుత అభినయంతో కట్టిపడేసింది కీర్తి. అందుకే అందరూ కీర్తి గురించి అంతలా మాట్లాడుకుంటున్నారు.
ఐతే కీర్తి స్థాయిలో పాత్ర.. వేరియేషన్లు లేకపోవచ్చు కానీ.. ఇందులో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటనను ఎంత పొగిడినా తక్కువే. చాలా ఈజ్ తో.. మెచ్యూరిటీతో ఆ పాత్రలో మెప్పించాడు దుల్కర్. నిజానికి సావిత్రి జీవితంలో జెమినీనే విలన్. సావిత్రి అభిమానులకు జెమిని అంటే పడదు. అతడి వల్లే ఆమె జీవితం నాశనమైందని అనుకుంటారరు. ఐతే దుల్కర్ కు ఉన్న పాజిటివ్ ఇమేజ్ వల్ల సినిమాలో మాత్రం జెమిని పాత్రను అందరూ ప్రేమిస్తారు. వాస్తవ జీవితంలో ఉన్న నెగెటివిటీని పూర్తిగా చూపిస్తే ఇబ్బంది కాబట్టి ఆ పాత్రను కొంచెం మార్చి చూపించారు. పైగా దుల్కర్ అద్భుత అభినయంతో.. స్క్రీన్ ప్రెజెన్స్ తో కట్టిపడేయడంతో ప్రేక్షకులు ఆ పాత్రను చాలా ఇష్టపడతారు. ద్వితీయార్ధంలో తనలోని నెగెటివ్ కోణాన్ని చూపించే సన్నివేశాల్లో దుల్కర్ నటన అతడెంత గొప్ప నటుడో చాటి చెబుతుంది. ఈ పాత్ర కోసం సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు దుల్కర్. అది పర్ఫెక్టుగా సెట్ అయింది. లుక్ విషయంలో జెమినికి దగ్గరగా లేకపోయినా.. హావభావాలతో ఆ పాత్రను మ్యాచ్ చేయగలిగాడు దుల్కర్. సావిత్రి పాత్రకు ఉన్న ప్రాధాన్యం.. కీర్తి అంచనాలకు మించి చేయడంతో అందరూ ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. సినిమాలో దుల్కర్ నటన కూడా అసామాన్యమైనది. అతడి గురించి మరిచిపోతే అది తప్పే అవుతుంది.