Begin typing your search above and press return to search.
నా సినిమాను చంపకండి.. ప్లీజ్
By: Tupaki Desk | 9 Oct 2017 11:41 AM GMTసినిమా ఎవ్వరు తీశారా అన్న విషయం చాలా మంది ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ఫైనల్ గా సినిమా వారికీ నచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. వారికి నచ్చితే చూడొద్దన్నా చూస్తారు. ఒకవేళ నచ్చకుంటే సినిమా హీరో చూడమని చెప్పినాసరే వారు పట్టించుకోరు. ఎవ్వరైనా సరే రెండు గంటలు సినిమా ఆహ్లాదకరంగా క్లియ్యర్ గా ఉంటే ఆనందంగా చూడాలని అనుకుంటారు కానీ కన్ఫ్యూజన్ తో ఉంటే మధ్యలోనే వచ్చేసి తీసినోడిని తిట్టికొక మానరు.
ఇప్పుడు అదే తరహాలో ఒక సినిమాకు తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. దీంతో సినిమా హీరో నా సినిమాపై అలా నెగిటివ్ కామెంట్స్ చేసి చంపవద్దని అర్దిస్తున్నాను. దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండని ఆవేదన చెందుతున్నాడు. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'సోలో' మూవీ రీసెంట్ గా 5వ తేదీన రిలీజ్ అయ్యింది. ఎక్స్పరిమెంటల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమా మొదటి షోకే దారుణమైన టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బి సి సెంటర్లలో ఆ సినిమా అర్ధం కాలేక సినిమా మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్ ని బ్రతిమాలాడు. ' దయచేసి సినిమా బాలేదని నెగిటివ్ టాక్ తో చంపేయకండి. ఓపెన్ మైండ్ తో వెళ్లి సినిమాను చుడండి తప్పకుండా సినిమా అర్థమవుతుందని ప్రాధేయపడ్డాడు. కానీ సినిమా అర్ధం కాకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరని అపజయం పొందినప్పుడు దాన్ని స్వీకరించడమే అని మరో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.