Begin typing your search above and press return to search.
సైలెంట్ గా వచ్చి.. డామినేట్ చేస్తున్న దుల్కర్!
By: Tupaki Desk | 11 Aug 2022 6:34 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో మంచి కంటెంట్ వస్తే భాషతో సంబంధం లేకుండా ఏ హీరో అయినా సరే మంచి క్రేజ్ అందుకుంటాడు అని చాలా సార్లు రుజువు అయింది. ముఖ్యంగా తమిళ హీరోలు తెలుగు మార్కెట్లో ఒకప్పుడు మంచి బాక్సాఫీస్ హిట్స్ కూడా సొంతం చేసుకున్నారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా నిర్వహించే స్థాయికి వచ్చారు. అంటే వారి క్రేజ్ ఎంతవరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఇప్పుడు మాత్రం డిఫరెంట్ కంటెంట్ కాకుండా కాస్త రొటీన్ గా వస్తున్న తమిళ హీరోలకు పెద్దగా సక్సెస్ లు రావడం లేదు. అప్పట్లో రజినీకాంత్ సూర్య కార్తీ వరుసగా సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే.
కానీ వారి సినిమాలు ఇటీవల రొటీన్ గా అనిపించడంతో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక అప్పుడెప్పుడో సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ మళ్ళీ ఇన్నాళ్లకు విక్రమ్ సినిమాతో ఫామ్ లోకి వచ్చేసాడు.
అయితే వీరందరూ కూడా డైరెక్ట్ గా హీరోగా సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. కానీ తెలిసి తెలియనట్టుగా సైలెంట్ గా దుల్కర్ సల్మాన్ తెలుగులో మార్కెట్ ను ఏర్పరుచుకోవడం విశేషం. మొదట అతను నటించిన హే సినామికా తెలుగు ఆడియోన్స్ కు కూడా కొంత ఆకట్టుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో అతను నటించిన విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు.
దుల్కర్ సల్మాన్ కు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో అతను డైరెక్ట్ గా హీరోగా మొదటి విజయాన్ని అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అందుకుంటున్న కలెక్షన్స్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే సీతారామం సినిమా ప్రమోషన్స్ సందర్భంగా దుల్కర్ సల్మాన్ ఈ రొమాంటిక్ హీరో ఇమేజ్‌తో విసిగిపోయానని, ఇకపై లవర్-బాయ్ తరహా సినిమాలు చేయడం ఇష్టం లేదని ప్రకటించాడు.
అయితే ఇటీవలి కాలంలో, అతని లవర్ బాయ్ పాత్రల్లో వచ్చిన సినిమాలే సక్సెస్ అవుతున్నాయి. కురుప్ వంటి చిత్రాలలో భారీ పాత్రలు వర్కవుట్ కాలేదు. ఈ తరుణంలో సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రంలో దుల్కర్ రామ్ పాత్రలో చల్లచక్కగా ఒదిగిపోయాడు. మరి ఇలాంటి క్రేజ్ ఉన్న దుల్కర్ సల్మాన్ రాబోయే రోజుల్లో మాస్ సినిమాలు డిఫరెంట్ యాక్షన్స్ సినిమాలు చేస్తే ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.