Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటోన్న 'స్వాతిముత్యం' పెళ్లి పాట..!

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:11 AM GMT
ఆకట్టుకుంటోన్న స్వాతిముత్యం పెళ్లి పాట..!
X
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, యువ హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా లాంచ్ అవుతున్న చిత్రం ''స్వాతిముత్యం''. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

'స్వాతిముత్యం' సినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ - టీజర్ - ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. గణేష్ తన పక్కింటి అబ్బాయి లుక్స్ - ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ తో మంచి ఇంప్రెషన్ ని కలిగించాడు.

'స్వాతిముత్యం' చిత్రాన్ని 2022 దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా తాజాగా 'డుమ్ డుమ్ డుమ్' అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

'నీ చారెడు కళ్లే' అనే మొదటి పాటతో మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర బృందం.. ఇప్పుడు 'డుమ్ డుమ్ డుమ్' అంటూ ప్రధాన జంట వివాహ సమయంలో వచ్చే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'అయినా నీ పేరు భాగ్యలక్ష్మి కాదే.. అలక నందా అని పెట్టాల్సింది..' అంటూ వర్ష ను గణేష్ కౌగిలించుకోవడంతో ఈ పాట ప్రారంభమవుతుంది. ప్రధాన జోడీ నిశ్చితార్థంతో మొదలై.. ఆ తర్వాత ప్రీ-వెడ్డింగ్ షూట్ - ఇరు కుటుంబాల పెళ్లి ఏర్పాట్లు - చివరకు వివాహ వేడుకను ఈ సాంగ్ లో చూపించారు.

మహతి స్వర సాగర్ ఈ పెళ్లి పాటకు స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. ఆదిత్య అయ్యంగార్ - అరుణ్ - లోకేష్ లు కలిసి ఆలపించారు. కంపోజిషన్ నుండి లిరిక్స్ మరియు గాత్రం వరకు అన్నీ ఈ పాటకు సరిగ్గా కుదిరాయి.

గణేష్ మరియు వర్ష బొల్లమ్మ జంట చాలా బాగుంది. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలాంటిదో ఈ పాట చూపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సూర్య అందించిన విజువల్స్ లవ్లీగా ఉన్నాయి. అవినాష్ కొల్లా దీనికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.

జీవితం - ప్రేమ - పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేది 'స్వాతిముత్యం' సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నరేష్ వీకే - రావు రమేష్ - సుబ్బరాజు - వెన్నెల కిషోర్ - సునయన - దివ్య శ్రీపాద తదితరులు ఇతర పాత్రలు పోషించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.