Begin typing your search above and press return to search.
దర్బార్ లిరిక్: పెళ్లి మూడ్ తెచ్చావులే తలైవా
By: Tupaki Desk | 26 Dec 2019 2:47 PM GMTవీల పాట.. గాలి పాట.. డప్పు.. దరువు పాట.. మృదంగ వాయిద్యం .. వెస్ట్రన్ ట్యూన్.. క్లాసిక్ బాణి.. పాట ఏదైనా దుమ్ము దులిపేయడం అనిరుధ్ స్టైల్. యువ సంగీత సంచలనం అనిరుధ్ సౌండింగే వేరు.. ఇన్ స్ట్రుమెంటేషన్ .. మ్యూజిక్ సెన్స్ వేరు.. అతడు ఈసారి కాస్త కొత్తగా పెళ్లి సాంగ్ కి సంగీతం అందించాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ - ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ సినిమా దర్బార్ కి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు అనగానే కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే దర్బార్ తో అతడు మరోసారి నిరూపించుకున్నాడా? అంటే.. ఈ సినిమా నుంచి తొలి సింగిల్ దుమ్ము ధూళి విడుదలైంది ఇప్పటికే. ఇందులోని ఎనర్జీ ఆకట్టుకుంది. తాజాగా `డుం డుం..` అంటూ సాగే పెళ్లి పాటను రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం అనిరుద్ మార్క్ కనిపించింది. పెళ్లిలో ఉండే ఆ జోష్ ని స్వరంలోకి రప్పించగలిగారు. నకష్ అజీజ్ గానం.. కృష్ణకాంత్ లిరిక్ ఆకట్టుకున్నాయి. అయితే ఎంత జోష్ నింపినా శ్రోతలకు ఇంకా ఏదో కొత్తగా ఆశిస్తారు. అదేదో కాస్త మిస్సయ్యిందే అనిపిస్తోంది. ఆ దరువులో కానీ.. ఇన్ స్ట్రుమెంటేషన్ లో కానీ ఎక్కడా శ్రుతి తప్పలేదు. ఎనర్జీ పుష్కలంగా ఉంది.. కానీ ఇంకా ఏదో కొత్తదనం కావాలి అనిపించింది.
అయితే ఈ ఒక్క పాటతో ఆల్బమ్ దమ్మెంతో తేల్చేయలేం. మునుముందు దర్బార్ నుంచి ఒక్కో ఆణిముత్యం శ్రోతల ముందుకు రానున్నాయి. అయితే రజనీ సినిమాల్లో క్లాసిక్ ఆల్బమ్స్ అన్నీ రెహమాన్ నుంచి వచ్చినవే. వాటిని మించేలా అనిరుధ్ కనీసం ఒక్క పాటలోనైనా ఇంకేదైనా చేస్తాడేమో చూడాలి. రజనీ - దర్బార్ సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ నడుమ రిలీజవుతున్న సంగతి తెలిసిందే.