Begin typing your search above and press return to search.
దునియా నటుడికి భార్యల కష్టాలెన్నో!
By: Tupaki Desk | 3 Oct 2018 7:39 AM GMTసెలబ్రిటీలు.. ప్రముఖులకు సంబంధించి కొన్ని అంశాలు చూస్తే.. ఆశ్చర్యకరంగా అనిపించక మానవు. శాండిల్ వుడ్ లో పేరున్న నటుడిగా సుపరిచితుడైన దునియా విజయ్ వ్యవహారం ఇలానే ఉంటుంది. నటుడిగా సుపరిచితుడైన విజయ్ ఈ మధ్యనే జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు.
తాజాగా విడుదలైన ఆయనకు ఇప్పుడు ఇద్దరు పెళ్లాల మధ్య విభేదాలు రచ్చ రచ్చగా మారాయి. తన భర్త రెండో పెళ్లి చేసుకోలేదని మొదటి భార్య నాగరత్న వాదిస్తుంటే.. తామిద్దరం పెళ్లి చేసుకొని ఒకే ఇంట్లో ఉంటున్నట్లుగా విజయ్ రెండో భార్య కీర్తి చెబుతోంది. దీనికి తగ్గట్లే బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన దునియా విజయ్.. తన రెండో భార్యతో పాటు ఇంటికి వెళ్లటమే కాదు.. అనంతరం గుడికి.. దర్గాకు వెళ్లి వచ్చారు.
బెయిల్ వచ్చినందుకు వేడుక చేసుకున్నారు. తనకు కష్టకాలంలో అండగా ఉన్న స్నేహితులకు విజయ్ థ్యాంక్స్ చెప్పారు. తనకు బెయిల్ రాకూడదని తన శత్రువులు అనుకన్నా.. దేవుడి దయతో బెయిల్ వచ్చిందని అతడు చెబుతున్నాడు. తనపై విచారణలో ఉన్న కేసు గురించి తాను మాట్లాడలేనని స్పష్టం చేస్తున్నాడు.
మొదటి భార్య నాగరత్న నాలుగేళ్ల క్రితం తన పరువును తీసి బజారుకు ఈడ్చిందని.. తన తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోలేదని ఆరోపించారు. తన ఇంటిని తన మొదటి భార్యకు ఇచ్చేశానని.. ఇప్పుడు తాను అద్దె ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు. తన ఆస్తిని మొదటి భార్యకు రాసిచ్చానని.. తన తల్లిదండ్రులు చచ్చినా రావొద్దంటూ నాగరత్నకు విల్లులోనే రాసినిట్లుగా పేర్కొన్నారు. నాగరత్న ఇప్పటివరకూ ఒక్కరోజూ నిజం మాట్లాడలేదని తప్పు పట్టారు. చూస్తుంటే.. విజయ్ కు ఇంటిపోరే ఎక్కువగా ఉన్నట్లు అనిపించట్లేదు?