Begin typing your search above and press return to search.
టాప్ హీరోయిన్ల డూప్ సీక్రెట్ లీక్!
By: Tupaki Desk | 29 July 2018 3:30 AM GMTభారీ బడ్జెట్లతో పురాణేతిహాసాల్ని వెండితెరకెక్కిస్తున్నారు మన దర్శకులు. అలాంటి సినిమాల్లో ప్రతి పాత్రకు మేకప్ పరంగా కానీ - ఆహార్యం పరంగా కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కాస్ట్యూమ్స్ అంతే భారీగా ఉంటాయి. రాణీవారిలానో - లేక అమ్మోరిలానో - లేక ఏకంగా దేవతా సుందరిగానో నటించాల్సి వస్తే ఆ పాత్రకు కాస్ట్యూమ్స్ - మేకప్ అతి భారీగా ఉండాల్సిందే. పైగా గంటలకు గంటలు ఆన్ లొకేషన్ మేకప్ కే సరిపోతుంది. అయితే ఇలాంటి సన్నివేశంలో భారీగా ఆభరణాలు - కాస్ట్యూమ్స్ మోయలేనంత బరువు మోయాలంటే కొందరు టాప్ హీరోయిన్లు అంగీకరించని సన్నివేశం ఉంటుందిట. మరి వాళ్లు నగలు పెట్టుకుని - బరువైన కాస్ట్యూమ్స్ ధరించకపోతే సీన్ తీయడమెలా? అంటారా? అక్కడే తప్పులో అడుగేశారు.
సరిగ్గా ఇలాంటి సన్నివేశం తలెత్తితే దానిని మ్యానేజ్ చేసేందుకు చిత్రాంగదలను బరిలో దించుతారట. చిత్రాంగద అంటే ఇక్కడ డూప్ అని అర్థం. అందాల కథానాయికలు భారీ - అతి భారీ ఆభరణాలు ధరించే సన్నివేశం వచ్చినప్పుడు ఆ స్థానంలో డూప్ ఆ నగల్ని - బరువైన కాస్ట్యూమ్స్ ని ధరించి నటిస్తుంది. అయితే ఫేస్ క్లోజ్ గా కనిపించే సీన్స్ తనపై తీయరు. ఫేస్ కనిపించేవి - క్లోజప్ షాట్స్ వంటివి సదరు నాయికపై తీసినా ఇతరత్రా సీన్స్ అన్నీ ఈ డూప్ పైనే చిత్రీకరిస్తారట. ఈ విషయాన్ని ఇలా హీరోయిన్లకు డూప్ గా నటించే ఓ నవయవ్వని తుపాకితో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ చెప్పుకొచ్చింది. తాను ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలందరికీ ఏదో ఒక సందర్భంలో డూప్ గా నటించానని తెలిపింది. ఇలా డూప్ గా నటించడం నరకం అని - డబ్బు కోసం తప్పదని కూడా సెలవిచ్చింది. అసలింతకీ హీరోయిన్లకు డూప్ లను ఎవరు సరఫరా చేస్తారు? అంటే అందుకు ప్రత్యేకించి కొందరు ఆడాళ్లు ఇండస్ట్రీలో ఉంటారని తెలిపింది. వార్నీ!!