Begin typing your search above and press return to search.
సోనమ్ కపూర్ కి ఓ చిలిపి సందేశం
By: Tupaki Desk | 19 May 2018 7:13 AM GMTఅనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని వివాహమాడిన ఈ కపూర్ పిల్ల... పెళ్లయిన తర్వాత ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ అనేక మంది ప్రముఖులు బహుమతులు పంపారు. అయితే సోషల్ మీడియా సాక్షిగా ఈ నవ దంపతులకు ఓ చిలిపి సందేశం పంపిందో కండోమ్ సంస్థ.
‘కంగ్రాట్స్ సోనమ్ అండ్ ఆనంద్... వీ హ్యావ్ గాట్ యు కవర్డ్’ అంటూ కింద తన సంస్థ లోగోను ముద్రించింది డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ. కొంచెం రసికతతో ఆలోచిస్తూ ఇందులో దాగి ఉన్న చిలిపి మీనింగ్... అర్థమవుతుంది. విషెస్ చెబుతూనే తన సంస్థ ఉత్పత్తులనే వాడండి అనే ప్రచారం చాలా కంపెనీలు చేస్తాయి. అయితే ఇక్కడ ప్రచారం చేస్తోంది ఓ కండోమ్ కంపెనీ కావడంతో మీనింగ్ మారిపోయింది. అయితే డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ ఇలాంటి చిలిపి సందేశాలు పెట్టడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల పెళ్లి సందర్భంగా కూడా ఇలాంటి చిలిపి మెసేజ్ పోస్టు చేసింది. ‘కంగ్రాట్స్ అనుష్క- కోహ్లీ... మీ ఇద్దరి మధ్య ఏది రాకూడదని కోరకుంటున్నాం... ఒక్క డ్యూరెక్స్ తప్ప!’ అంటూ కొంటెగా పోస్టు చేసిన డోరెక్స్... ఎట్టకేలకు విరాట్ తన మెయిడిన్ ఓవర్ వేశాడంటూ కామెంట్ పెట్టింది.
ఈ చిలిపి సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూనే... మరో వైపు తమ బ్రాండ్ కండోమ్ లకి తెగ ప్రచారం చేసుకుంటోంది డ్యూరెక్స్. ప్రచారమూ- పాపులారిటీ... వాట్ ఎన్ ఐడియా సర్ జీ!