Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండకు బహిరంగ క్షమాపణ
By: Tupaki Desk | 18 Sep 2020 1:30 PM GMTతమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్ టైన్ మెంట్స్ వారు తమ సినిమాలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన ఆ సంస్థ కొందరితో తమ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. అతడికి జోడీగా హీరోయిన్ కావాలంటూ ప్రచారం చేస్తూ ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తో ఒప్పందం చేసుకున్నారట. ఒకరు ఇద్దరు హీరోయిన్స్ ఆ విషయాన్ని నిర్థారించుకునేందుకు విజయ్ దేవరకొండ టీమ్ ను సంప్రదించగా అలాంటిది ఏమీ లేదని, అసలు డస్కీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు విజయ్ దేవరకొండ డేట్లు ఇవ్వలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. విజయ్ పేరు చెప్పి ఆడిషన్స్ నిర్వహిస్తున్నందుకు గాను డస్కీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థపై లీగల్ చర్యలకు సిద్దం అయ్యారు.
విషయం కాస్త సీరియస్ అవ్వడంతో డస్కీ సంస్థ వారు బహిరంగంగా విజయ్ దేవరకొండకు క్షమాపణ చెప్పారు. తాము నటీ నటుల కోసం ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చాం. వారు మాకు తెలియకుండానే మీ పేరు వాడారు. మీ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశ్యం మాకు అస్సలు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. హీరోల పేరు చెప్పి హీరోయిన్స్ ను కొత్త వారిని బుట్టలో పడేసుకునేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. కొందరు కావాలని కూడా ఇలాంటివి చేస్తున్న కారణంగా వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. విజయ్ టీం గతంలోనే ఇలాంటి ప్రకటనలకు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు తమిళనాట విజయ్ దేవరకొండ పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నించి డస్కీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ వారు అడ్డంగా బుక్ అయ్యి బహిరంగ క్షమాపణ చెప్పారు.