Begin typing your search above and press return to search.
దసరా లేదా క్రిస్మస్.. ఏజెంట్ సెలెక్షన్ ఏదీ?
By: Tupaki Desk | 21 July 2022 12:30 PM GMTఅక్కినేని చియాన్ అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' పాన్ ఇండియా కేటగిరీలో హిందీ సహా దక్షిణాదిన అన్ని భాషల్లో విడుదలవుతోంది.హిందీ-తెలుగు-తమిళం-మలయాళం-కన్నడలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేస్తామని ఇంతకుముందే టీమ్ ప్రకటించింది. ముఖ్యంగా అఖిల్ - సూరి బృందం హిందీ ఆడియెన్ ని పెద్దగా టార్గెట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఏజెంట్ లుక్ ని విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది.
ఈ మూవీ కోసం అఖిల్ ఎంత హార్డ్ వర్క్ చేశాడన్నది అతడి మేకోవర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇదంతా అఖిల్ తపన.. కష్టానికి ప్రూఫ్. కానీ అతడు ఆశించిన మాసివ్ హిట్ దక్కుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
అలా జరగాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. అందుకే ఈసారి అఖిల్ స్పై ఏజెంట్ గా వస్తున్నాడు. సైరా లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని క్లాసిక్ మేకింగ్ స్టైల్ తో నిరూపించుకున్న సురేందర్ రెడ్డి ఈసారి గూఢచర్యం నేపథ్యంలో యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథనే ఎంపిక చేసుకున్నాడు. అఖిల్ కోసం రాజీ పడకుండా బడ్జెట్లు పెట్టే బ్యానర్లు తనకు అండగా నిలిచాయి కాబట్టి అతడు ఏజెంట్ ని అంతే రిచ్ గా తెరకెక్కిస్తున్నాడు.
విజువల్ వండర్స్ అనిపించే గొప్ప లొకేషన్లలో అల్ట్రా రిచ్ యాంబియెన్స్ తో ప్రతి ఫ్రేమ్ ని తెరకెక్కిస్తున్నాడని ఇంతకుముందు విడుదలైన ఫోటోలు వెల్లడించాయి. హాలీవుడ్ పాపులర్ ఫ్రాంఛైజీ బార్న్ సిరీస్ తరహాలో విజువల్స్ తో కట్టి పడేయనున్నాడన్న టాక్ ఇన్ సైడ్ ఉంది. ఇక ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే సరైన రిలీజ్ తేదీ మరొక ఎత్తు. ఇంతకీ ఏజెంట్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారా? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఆగస్టు రేస్ నుంచి వెనక్కి తగ్గి ఇప్పుడు దసరా అనుకుంటున్నాడట. కానీ అప్పుడు నాగార్జున 'ఘోస్ట్' వస్తోంది. చిరంజీవి 'గాడ్ ఫాదర్' కూడా దసరా రిలీజ్ కే మొగ్గు చూపారని సమాచారం ఉంది. అయితే ఘోస్ట్ విడుదలైన రెండు వారాలకు అఖిల్ సినిమాని రిలీజ్ చేయాలా లేకపోతే నాగ్ సెంటిమెంట్ ప్రకారం.. డిసెంబర్ కి వెళ్లాలా? అన్నదే సందిగ్ధంలో పడింది.
డిసెంబర్ లో అవతార్ 2 విడుదలవుతోంది. రణవీర్ సింగ్ సర్కస్ కూడా అదే నెలలో ఉత్తరాదిన భారీగా విడుదలవుతుంది. అందువల్ల డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులకు సెంటిమెంట్ గా వచ్చేద్దామనుకున్నా ప్లాన్ సరిగా ఉండాలని విశ్లేషిస్తున్నారు. ఏజెంట్ భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి పోటీ లేకుండా సోలోగా రావాలి. పైగా సెలవులు వారాంతాలు కూడా కలిసి రావాలి. దానికి సూరి బృందం ఎలాంటి కసరత్తు చేస్తోందో వేచి చూడాలి.