Begin typing your search above and press return to search.

ద‌స‌రా సీజ‌న్‌.. ఆ మెరుపులు లేవే?

By:  Tupaki Desk   |   11 Oct 2022 6:30 AM GMT
ద‌స‌రా సీజ‌న్‌.. ఆ మెరుపులు లేవే?
X
ద‌స‌రా సీజ‌న్ వ‌చ్చేసిందంటే టాలీవుడ్ లో సినిమాల సంద‌డి ఓ రేంజ్ లో వుండ‌టం ఆన‌వాయితీ. భారీ సినిమాలు, చిన్న సినిమాలు అని తేడా లేకుండా చాలా వ‌ర‌కు క్రేజీ స్టార్ల సినిమాలు ఈ సీజ‌న్ లో పోటీప‌డుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ క‌రోనా థ‌ర్డ్ వేవ్ భ‌యాల‌ కార‌ణంగా నీరు గార‌డంతో అంద‌రి దృష్టి ద‌స‌రా సీజ‌న్ పై ప‌డింది. ఈ ద‌స‌రా అయినా స్టార్ల సినిమాలు పోటీప‌డ‌తాయ‌ని, భారీ స్థాయిలో హ‌డావిడీ వుంటుంద‌ని అంతా భావించారు. కానీ ఆ మెరుపులు కనిపించ‌డం లేదు.

ఈ ద‌స‌రాకు అక్టోబ‌ర్ 5న రెండు భారీ సినిమాలు, ఒక చిన్న సినిమా విడుద‌లైంది. ఇందులో సీనియ‌ర్ స్టార్స్‌ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌', నాగార్జున 'ది ఘోస్ట్‌' విడుద‌ల కాగా, బెల్లంకొండ గ‌ణేష్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ నిర్మించిన మూవీ 'స్వాతిముత్యం'. ఈ మూడు సినిమాల్లో రెండింటికి పాజిటివ్ టాక్ వున్నా.. ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక తీవ్ర నిరాశ‌కు గురి చేస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' పాజిటివ్ టాక్ తో మంచి శుభారంభాన్ని అందుకుంది. ద‌స‌రా సెల‌వులు కావ‌డం కూడా ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. అయితే మండే నుంచి ఈ సినిమాకు అస‌లు ప‌రీక్ష మొద‌లైంది. తొలి సారి ఎలాంటి పాట‌లు, హీరోయిన్ లేకుండా చిరు ప్ర‌యోగాత్మ‌కంగా చేసిన ఈ మూవీలో 'గాడ్ ఫాద‌ర్‌' గా క‌నిపించి త‌న‌దైన స్వాగ్ తో చిరు ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అదే అభిమానుల్ని, స‌గ‌టు ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.

ఎంత‌గా ఎట్రాక్ట్ చేసినా గ‌త సినిమాల త‌ర‌హాలో మాత్రం 'గాడ్ ఫాద‌ర్‌' వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోతోంది. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ సాధించ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇక యుఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద 'గాడ్ ఫాద‌ర్‌' మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసింది. అయితే ఇది చాలా త‌క్కువ. ఇప్ప‌టికే అంత‌కు మించి రాబ‌ట్టాల్సింది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టికే 'గాడ్ ఫాద‌ర్‌' 2 మిలియ‌న్ డాల‌ర్ క్రాస్ చేయాల్సింది.. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఈ దార‌మైనా బాక్సాఫీస్ వ‌ద్ద మెరుపులు మెరిపిస్తుందా? లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.

ఇక చిరుతో పాటు ఈ ద‌స‌రాకు నాగార్జున కూడా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ 'ది ఘోస్ట్‌'తో బ‌రిలోకి దిగాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో ఆస‌క్తిని రేకెత్తించినా కానీ ఆ స్థాయిలో ఓపెనింగ్స్ ని నాగ్ రాబ‌ట్ట‌లేక‌పోయాడు. టాక్ బ‌య‌టికి రావ‌డంతో సినిమాపై క్రేజ్ మ‌రింత త‌గ్గి సినిమా డిజాస్ట‌ర్ గా మారింది. యుఎస్ లో అయితే ఈ మూవీ వ‌సూళ్ల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా వుందంటే ప‌రిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ల తో ద‌స‌రా బ‌రిలో కొత్త హీరో బెల్లంకొండ గ‌ణేష్ 'స్వాతిముత్యం'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల సినిమాల‌కు మించి ఈ మూవీకే మంచి టాక్ వున్నా ప్రేక్ష‌కులు మాత్రం ఈ మూవీపై ఏమంత ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం ప్ర‌ధాన ఇబ్బందిగా మారింది. బెల్లంకొండ గ‌ణేష్ కొత్త హీరో కావ‌డం, టికెట్ రేట్ల స‌మ‌స్య కార‌ణంగా ప్రేక్ష‌కులు ఈ మూవీపై ఆస‌క్తిని చూపించ‌డం లేదు. షేర్లు మ‌రీ దారుణంగా వున్నాయ‌ట‌. యుఎస్ లో ఖ‌ర్చులు కూడా రావ‌డం గ‌గ‌న‌మే అని తెలుస్తోంది. దీంతో నిర్మాణ సంస్థ‌కిది బిగ్ షాక్ అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.