Begin typing your search above and press return to search.

308వ గ‌ర్ల్ ఫ్రెండ్ కావాల‌ట‌.. ద‌త్ పై ఫైరింగ్!

By:  Tupaki Desk   |   7 Dec 2019 10:54 AM GMT
308వ గ‌ర్ల్ ఫ్రెండ్ కావాల‌ట‌.. ద‌త్ పై ఫైరింగ్!
X
రియాలిటీ షోలు.. లైవ్ షోల్లో హీరోలు ఏదైనా తేడా మాట్లాడితే సామాజిక మాధ్య‌మాల్లో ట్రోల్స్ త‌ప్ప‌డం లేదు. ఏదైనా టీవీ షో లైవ్ లో మాట్లాడుతూ స‌ర‌దాగా ఏదైనా కామెంట్ చేసినా అడ్డంగా బుక్క‌యిపోతున్నారు. ఏదో ఫ్లోలో స‌ర‌దా కామెంట్ చేసేస్తాం అంటే కుద‌ర‌డం లేదు. ఆచితూచి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇలా ఎంద‌రో లైవ్ కార్య‌క్ర‌మాల్లో నోరు జారి బుక్క‌యిన వాళ్లు ఉన్నారు.

లేటెస్ట్ గా బాలీవుడ్ మున్నాభాయ్ సంజ‌య్ ద‌త్ టీవీ రియాలిటీ క‌పిల్ శ‌ర్మ షోలో నోరు జారారు. `మీ 300 మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు?` అంటూ క‌పిల్ శ‌ర్మ ద‌త్ ని ప్ర‌శ్నిస్తే.. ``నాకు ఎంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారో ఇంకా లెక్కపెట్టలేదు. కృతి సనన్ ని నా 308వ గాళ్ ఫ్రెండ్ ని చేసుకోవాలని అనుకుంటున్నా`` అంటూ స‌ర‌దాగా న‌వ్వేశారు భాయ్. అయితే ఈ కామెంట్ స‌రికాదు అంటూ న‌టి దీపాన్నిత శ‌ర్మ సోష‌ల్ మీడియా వేదిక‌గా విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌లా ఒక అమ్మాయి అలా వ్యాఖ్యానిస్తే ఈ స‌మాజం ఊరుకుంటుందా? సినిమా ప్ర‌మోష‌న్ కోసం 300 మంది గాళ్ ఫ్రెండ్స్ అంటూ గొప్ప‌లు చెప్పుకున్నారు. అంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది.

ఇదే క‌పిల్ శ‌ర్మ షోలో ఒక అమ్మాయి అలా వ్యాఖ్యానిస్తే స‌మాజం అంగీక‌రిస్తుందా? అంటూ ప్ర‌శ్నించింది స‌ద‌రు న‌టి. ఇక దీపాన్నిత‌కు నెటిజ‌నుల నుంచి కావాల్సినంత స‌పోర్ట్ ద‌క్కింది. ద‌త్ జీ కామెంట్ స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. సంజ‌య్ ద‌త్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించిన సంజు చిత్రంలో 300 మంది గాళ్స్ తో మున్నాభాయ్ డేటింగ్ వ్య‌వ‌హారంపై ఓ సంభాష‌ణ ఉంది. దానికి ఫ్యాన్స్ లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది. క‌పిల్ శ‌ర్మ షోలోనూ ద‌త్ జీ జోక్ చేస్తే దానికి కూడా జ‌నం విరగ‌బ‌డి న‌వ్వారు. దీనిని బ‌ట్టి ప్ర‌స్తుత స‌మాజం ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవ‌చ్చు అనేది దీపాన్నిత కౌంట‌ర్ అన్న‌మాట‌.