Begin typing your search above and press return to search.
‘డీజే’ మలయాళ ట్రీట్ ఎప్పుడంటే..
By: Tupaki Desk | 2 July 2017 7:36 AM GMTఅల్లు అర్జున్ కు మలయాళంలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి ప్రతి సినిమా కేరళలో భారీ స్థాయిలో విడుదలవుతుంది. బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ను కూడా మలయాళంలోకి తీసుకెళ్తున్నారు. తెలుగు వెర్షన్ విడుదలైన మూడు వారాలకు.. జులై 14న మలయాళంలో విడుదల చేయబోతున్నారీ చిత్రాన్ని. మలయాళంలోనూ ‘దువ్వాడ జగన్నాథం’ అనే పేరునే ఖరారు చేశారు. పోయినేడాది అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ను కూడా తెలుగులో విడుదలైన తర్వాత కొంచెం లేటుగా ‘యోధవు’ పేరుతో కేరళలో విడుదల చేశారు. అంతకుముందు కూడా బన్నీ సినిమాలన్నీ తెలుగుతో పోలిస్తే ఆలస్యంగానే మలయాళంలోకి వెళ్లాయి.
కేరళలో బన్నీకి ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా తన సినిమాల డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు బన్నీ. హడావుడి లేకుండా టైం తీసుకుని డబ్బింగ్ పనులు చేయిస్తున్నాడు. ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేసి.. కేరళలో స్టార్ హీరోల సినిమాల స్థాయిలో తన సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఐతే ‘డీజే’కు తెలుగులో డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మలయాళ వెర్షన్ అక్కడి ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకర్షిస్తుందన్న సందేహలున్నాయి. పైగా ‘డీజే’ పరమ రొటీన్ సినిమా. కొత్త తరహా సినిమాలకు పట్టం కట్టే మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బన్నీ.. ఇండియాకు వచ్చాక కొన్ని రోజుల పాటు కేరళలో పర్యటించి ‘డీజే’ మలయాళ వెర్షన్ ను ప్రమోట్ చేయబోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/