Begin typing your search above and press return to search.

మెగా కాంపౌండ్ తో RRR నిర్మాత మెగా డీల్?

By:  Tupaki Desk   |   12 March 2022 5:06 AM GMT
మెగా కాంపౌండ్ తో RRR నిర్మాత మెగా డీల్?
X
డి.వి.వి.దాన‌య్య .. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. RRR నిర్మాత కాక ముందే మెగా నిర్మాత‌. మెగా కాంపౌండ్ హీరోలు చిరంజీవి .. చ‌ర‌ణ్ ల‌తో సినిమాల‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇందులో చ‌ర‌ణ్- తార‌క్ క‌థానాయ‌కులుగా న‌టించ‌గా.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

మార్చి 25న ఆర్.ఆర్.ఆర్ గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. త‌దుప‌రి దానయ్య ప్ర‌ణాళిక ఎలా ఉంది? అని ఆరా తీస్తే ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. డీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ మెగా ప్రాజెక్ట్ లను లైనప్ లో ఉంచాడ‌ని తెలుస్తోంది. వీటిలో మెగా కాంపౌండ్ హీరోల‌తోనే ఎక్కువ‌గా ఉన్నాయి. చిరుతో సినిమాని ఇంత‌కుముందే దాన‌య్యా ఖాయం చేసుకున్నారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. దీనికి KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వ‌హిస్తారు. చిరు-చ‌ర‌ణ్‌- ప్ర‌శాంత్ నీల్ బృందం ఇటీవ‌లి భేటీ గురించి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తేరి తెలుగు రీమేక్ ను కూడా నిర్మించ‌నున్నాడని వినికిడి. దీనికి త్రివిక్రమ్ డైలాగ్స్- స్క్రీన్ ప్లే అందించ‌నున్నారు. దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.

కేవ‌లం మెగా కాంపౌండ్ తోనే కాదు మ‌రో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని దాన‌య్య క్యాచ్ చేశారు. మారుతీ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ కోసం దానయ్య ప్రభాస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మేలో ప్రారంభం కానుందని సమాచారం. ఇవే కాకుండా నాగ చైతన్య హీరోగా ఓ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నట్లు కూడా గుస‌గుస‌ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు.

అయితే దీనిపై మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంటుంది. మహేష్ బాబు- అల్లు అర్జున్- ధనుష్ వంటి స్టార్ హీరోలతో దానయ్య మరిన్ని భారీ ప్రాజెక్ట్ లను ఖాయం చేసుకోవాల‌ని దాన‌య్య ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ నిర్మాత అన్న క్రేజ్ తో అత‌డి ప్ర‌తి ప్ర‌ణాళికా స‌క్సెస్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

RRR పెద్ద హిట్ అయితే దానయ్య రేంజు ఇంట‌ర్నేష‌న‌ల్ కి పాకుతుంది. పాన్ ఇండియా లేదా పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల నిర్మాత‌గా అతడి పాపులారిటీ అమాంతం పెరుగుతుంది. ఈ ట్యాగ్ లైన్ తో అగ్ర హీరోల రేంజు కూడా ఇంకా విస్త‌రిస్తుంది.