Begin typing your search above and press return to search.

అలాంటి సెటైర్లేమీ లేవే

By:  Tupaki Desk   |   17 April 2018 8:46 AM GMT
అలాంటి సెటైర్లేమీ లేవే
X
మ‌హేష్ బాబు సీఎంగా చేస్తున్న సినిమా భ‌ర‌త్ అను నేను. హీరోనే సీఎం అనగానే అది పొలిటిక‌ల్ జోన‌ర్ సినిమా వేరే చెప్ప‌క్క‌ర్లేదు. అందులోను ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా మ‌హేష్ చేస్తున్నాడంటే... తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప‌ర్య‌వ‌సానాల‌పై, కొన్ని రాజ‌కీయ పార్టీల‌పై సెటైర్లు ప‌డే ఉంటాయ‌ని ప్ర‌తి ఒక్క‌రు భావించ‌డం స‌ర్వ సాధార‌ణం. అస‌లే ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న స‌మ‌యం కావ‌డంతో ఎన్ని పొలిటిక‌ల్ సెటైర్లు భ‌ర‌త్ అను నేను సినిమాలో ప‌డ‌నున్నాయో అని ఒక‌టే ఫిల్మ్ న‌గ‌ర్‌ లో చ‌ర్చ‌. దీనిపై ఆ సినిమా నిర్మాత దాన‌య్య క్లారిటీ ఇచ్చారు.

భర‌త్ అను నేను సినిమా లో ఏ రాజ‌కీయ పార్టీని తాము ప్ర‌స్తావించ‌లేదని, వాటి చ‌ర్య‌ల‌ను విమ‌ర్శించ‌లేద‌ని చెప్పారు దాన‌య్య‌. సినిమా పొలిటిక‌ల్ జోన‌ర్‌ లో ఉన్నా కూడా క‌థ‌లో ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా తీశామ‌ని వివ‌రించారు. రాజ‌కీయ పార్టీల‌పై సెటైర్లు ఉంటాయ‌న్న‌ది కేవ‌లం పుకారు మాత్ర‌మేన‌ని స్ప‌ష్టంగా చెప్పేశారు. దాన‌య్య ఇచ్చిన క్లారిటీ అభిమానుల‌క‌న్నా కూడా రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కే కాస్త ఊర‌ట నిచ్చింది. మ‌హేష్ బాబు తొలిసారి రాజ‌కీయ‌నేత‌గా, అందులోనూ ముఖ్య‌మంత్రిగా న‌టిస్తుండ‌డంతో సినిమాలో అంచ‌నాలు ఓ రేంజిలో ఉన్నాయి.

శ్రీమంతుడు హిట్ కాంబో మ‌హేష్‌ - శివ కొర‌టాల చేస్తున్న త‌రువాతి సినిమా కావ‌డంతో అభిమానులు సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కైరా అద్వాణీ మెయిన్ ఫిమేల్ లీడ్‌ గా క‌నిపించ‌నుంది. కైరా ఇంత‌కుముందు ఎమ్ ఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో సాక్షి సింగ్‌ గా క‌నిపించింది.